📌 Key Points
- ఏఆర్ రెహమాన్ నటుడిగా అరంగేట్రం చేయనున్నారు.
- ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ‘మూన్ వాక్’ చిత్రంలో దర్శకుడిగా కనిపిస్తారు.
- 25 ఏళ్ల తర్వాత రెహమాన్-ప్రభుదేవా కాంబినేషన్ మళ్ళీ.
- మనోజ్ ఎస్ఎన్ దర్శకత్వంలో డ్యాన్స్-మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా ‘మూన్ వాక్’.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సరికొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకుడిగా మారబోతున్నారని వార్తలు వచ్చినా, అసలు విషయం అది కాదు. ప్రభుదేవా హీరోగా రాబోతున్న ‘మూన్ వాక్’ సినిమాలో రెహమాన్ దర్శకుడి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
రెహమాన్ కొత్త పాత్ర: దర్శకుడిగా కాదా?
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలు తమ టాలెంట్‌ను ఒకే రంగానికి పరిమితం చేయకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణం, బిజినెస్‌ల్లోనూ రాణిస్తూ తమ స్థాయిని మరింత పెంచుకుంటున్నారు. ఈ కోవలోకి సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) కూడా చేరారు. సోషల్ మీడియాలో ఆయన పేరు హాట్ టాపిక్‌గా మారింది. రెహమాన్ దర్శకుడిగా మారబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పాటలతో మాయ చేసే ఆయన ఇప్పుడు కెమెరా వెనక బాధ్యతలు చేపట్టబోతున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ టాక్ అభిమానుల్లో భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. కానీ అసలు విషయం ఏమిటంటే.. రెహమాన్ నిజంగా దర్శకత్వం చేయడం లేదట. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, హీరో ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఆయన దర్శకుడి పాత్రలో నటించబోతున్నాడని టాక్.
అంటే కథలో భాగంగా దర్శకుడిగా కనిపించనున్నారన్నమాట. అయినా ఇది కూడా రెహమాన్ కెరీర్‌లో ఓ డిఫరెంట్ అటెంప్ట్‌గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుదేవా(Prabhudeva)-రెహమాన్ కాంబినేషన్ అంటేనే ఓ మ్యాజిక్ అనే పేరు ఉంది. ఇప్పుడు అదే జోడీ నటన కోణంలో కలవడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ చిత్రం దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఏ.ఆర్. రెహమాన్, ప్రభుదేవా కాంబోలో రాబోతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. రెహమాన్ లుక్ ఎలా ఉండబోతోంది? ఆయన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో పెరుగుతోంది. అధికారిక అప్డేట్ రాగానే ఈ ప్రాజెక్ట్ మరింత సంచలనంగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఈ సినిమాకు మనోజ్ ఎస్ఎన్(Manoj SN) దర్శకత్వం వహిస్తుండగా.. బిహైండ్ వుడ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ‘మూన్ వాక్’టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా డ్యాన్స్-మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
ప్రభుదేవాతో 25 ఏళ్ల తర్వాత మళ్ళీ
‘మూన్ వాక్’ సినిమా వివరాలు
ఏఆర్ రెహమాన్ తొలిసారి నటుడిగా కనిపించబోతుండటం, అది కూడా ప్రభుదేవాతో కలిసి 25 ఏళ్ల తర్వాత కావడం సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ‘మూన్ వాక్’ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


