
📌 Key Points
- అరియనా గ్లోరీకి రాజకీయాలపై తీవ్ర ఆసక్తి ఉందని, భవిష్యత్తులో రావాలని కోరుకుంటుంది.
- కనీసం తన స్వంత తాండూర్ గల్లీ కౌన్సిలర్‌గానైనా అవ్వాలని ఆమె కోరిక.
- తన పరిధిలో ఉన్న ప్రాంతానికి మంచి చేయాలని, మహిళల సమస్యలు తీర్చడానికి పాదయాత్ర చేస్తానని వెల్లడి.
- సీఎం అయితే బ్యాంకులో రూ.50 వేల లోపు ఉన్న అందరి అకౌంట్స్‌లో రూ.10 లక్షలు వేస్తానని హామీ ఇచ్చింది.
ప్రముఖ యాంకర్, నటి అరియనా గ్లోరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సీఎం అయితే ఏం చేస్తానో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె పాదయాత్ర ప్రణాళిక, ఇతర కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
రాజకీయాలపై అరియనా ఆసక్తి
Ariyana Glory : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అరియనా తర్వాత సోషల్ మీడియా, బిగ్ బాస్, పలు టీవీ షోలతో ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. తాజాగా అరియనా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తనకు పాలిటిక్స్ మీద ఉన్న ఆసక్తి గురించి తెలిపింది.(Ariyana Glory)
పాదయాత్ర, కౌన్సిలర్ లక్ష్యం
సీఎం అయితే అరియనా ప్రణాళిక
అరియనా గ్లోరీ మాట్లాడుతూ.. ఫ్యూచర్ లో గల్లీ కౌన్సిలర్ అన్నా, ఎమ్మెల్యే అయినా అయ్యేలా చూడు అని దేవుడ్ని దండం పెట్టుకుంటాను. నేను పాలిటిక్స్ లోకి రావాలి అనుకుంటున్నాను. నాకు కనీసం మా తాండూర్ లో గల్లీ కౌన్సిలర్ అయినా అవ్వాలని నా కోరిక. నేను పాదయాత్ర కూడా చేస్తా. నా పరిధిలో ఉన్న ప్లేస్ వరకు నేను మంచి చేస్తా. అక్కడ ఉండే లేడీస్ కి ఏం కావాలి, ఆ కాలనీకి ఏం కావాలి చూసుకుంటా. నేను సీఎంకు అయితే 50 వేలు కంటే బ్యాంక్ లో తక్కువ ఉన్న అందరి అకౌంట్స్ లోకి పది లక్షలు చొప్పున వేస్తా. లైఫ్ అంతా కష్టపడుతూ ఉంటారు, కనీసం ఒక్కసారైనా ఎంజాయ్ చేయాలి. అందుకే వేస్తాను అని తెలిపింది. మరి నిజంగానే భవిష్యత్తులో అరియనా రాజకీయాల్లోకి వస్తుందేమో చూడాలి.
అరియనా గ్లోరీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రాజకీయాలపై ఆమెకున్న ఆసక్తి, సీఎం అయితే చేయబోయే పనులపై హామీలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. భవిష్యత్తులో ఆమె నిజంగానే రాజకీయాల్లోకి వస్తుందేమో చూడాలి.


