|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివాజీ గారి ఉద్దేశం కరెక్టే: వివాదంపై అరియనా గ్లోరీ సంచలన వివరణ!

Published: 28-12-2025, 8:15 AM
శివాజీ గారి ఉద్దేశం కరెక్టే: వివాదంపై అరియనా గ్లోరీ సంచలన వివరణ!
  • నటుడు శివాజీ దండోరా ఈవెంట్‌లో అమ్మాయిల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి.
  • కొందరు సెలబ్రిటీలు శివాజీని టార్గెట్ చేసి విమర్శించగా, మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.
  • నటి అరియనా గ్లోరీ శివాజీ ఉద్దేశం కరెక్టేనని, ఆయన మంచి కోసమే చెప్పారని సమర్థించింది.
  • అరియనా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీశాయి.

నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపాయి. అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో నటి అరియనా గ్లోరీ శివాజీ ఉద్దేశాన్ని సమర్థించడం చర్చనీయాంశమైంది.

శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు: అసలు ఏం జరిగింది?

Ariyana Glory : ఇటీవల నటుడు శివాజీ దండోరా సినిమా ఈవెంట్లో అమ్మాయిలు, హీరోయిన్స్ చక్కగా చీరలు కట్టుకోండి, మంచి బట్టలు వేసుకోండి అని చెప్తూ పొరపాటున ఓ రెండు పదాలు అసభ్యకరంగా మాట్లాడటంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇంకేముంది కొంతమంది శివాజీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.(Ariyana Glory)

అమ్మాయిలకు మీరెవరు చెప్పడానికి, అమ్మాయిలపై మీ కంట్రోల్ ఏంటి అంటూ పలువురు సెలబ్రిటీలు శివాజీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం శివాజీ పదాలు తప్పుగా వాడినా మంచి విషయమే చెప్పాడు అని సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి, యాంకర్ అరియనా గ్లోరీ శివాజీకి సపోర్ట్ గా మాట్లాడింది.

అరియనా గ్లోరీ సపోర్ట్: ఉద్దేశం సరైందే!

అరియనా గ్లోరీ తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయిల డ్రెస్సింగ్, శివాజీ కామెంట్స్ గురించి చర్చకు వచ్చింది.

అరియనా వ్యాఖ్యలు వైరల్: సోషల్ మీడియా రియాక్షన్

దీనిపై అరియనా గ్లోరీ మాట్లాడుతూ.. శివాజీ గారి ఉద్దేశం కరెక్ట్. కానీ ఆయన మాట్లాడిన పదాల వల్ల వైరల్ అవుతుంది. అంతే కానీ ఆయన ఉద్దేశం మంచిగా ఉండాలి, సేఫ్టీగా ఉండాలి అని. ఎవరి ఉద్దేశం వాళ్ళది. మా ఇంట్లో అమ్మ కూడా కొన్ని చెప్తుంది అలాగే. ఆయన ఉద్దేశం కూడా కరెక్ట్ కానీ అది వేరేలా వెళ్ళింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు కానీ తీసుకునేవాళ్లను బట్టి ఉంటుంది. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. నేను ఇప్పుడు పద్దతిగా మాట్లాడి బయట ఎక్కడో ఎలాగో ఉన్నాను అనుకో నన్ను ట్రోల్ చేస్తారు అని తెలిపింది. దీంతో అరియనా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

శివాజీ వ్యాఖ్యల వివాదంపై అరియనా గ్లోరీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చెప్పిన విషయాలపై భిన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై చర్చ ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.