|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అర్జున్ చక్రవర్తి రివ్యూ.. నల్గొండ కబడ్డీ ప్లేయర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ఎలా సాగిందంటే?

Published: 29-08-2025, 7:48 AM
అర్జున్ చక్రవర్తి రివ్యూ.. నల్గొండ కబడ్డీ ప్లేయర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ఎలా సాగిందంటే?

నల్గొండకు చెందిన మాజీ కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అర్జున్ చక్రవర్తి’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో, దాని ప్రతిభావం ఏమిటో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

Key Points

1

అర్జున్ చక్రవర్తి జీవితం ఆధారంగా తీసిన స్పోర్ట్స్ డ్రామా

2

1980-90ల నాటి కాలం బ్యాక్‌డ్రాప్‌లో కథాగమనం

4

అద్భుతమైన ఆర్ట్ వర్క్, కానీ సాధారణ ప్రేమకథ

కథాంశం మరియు నేపథ్యం

టైటిల్: అర్జున్ చక్రవర్తి

నటీనటులు: విజయ రామరాజు, సిజా రోజ్, దయానంద్ రెడ్డి, అజయ్, అజయ్ ఘోష్, హర్ష్ రోషన్ తదితరులు

దర్శకత్వం: విక్రాంత్ రుద్ర

సంగీతం: విఘ్నేశ్ భాస్కరన్

సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి

విడుదల తేది: ఆగస్ట్ 29, 2025

నటన మరియు దర్శకత్వం

తెలుగులో బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన సినిమా అర్జున్ చక్రవర్తి . విజయ రామరాజు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను నల్గొండ మాజీ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య జీవితం ఆధారంగా తీసినట్లు ఓ ఇంటర్వ్యూలో నిర్మాత శ్రీని గుబ్బల తెలిపారు.

విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన అర్జున్ చక్రవర్తి సినిమా ఇవాళ అంటే ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి అర్జున్ చక్రవర్తి రివ్యూ లో తెలుసుకుందాం.

అనాథ అయిన అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు)ని మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య (దయానంద్ రెడ్డి) పెంచుకుంటాడు. ఇద్దరు మామ అల్లుళ్లలా జీవిస్తారు. రంగయ్య లాగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అర్జున్ చక్రవర్తి పాల్గొనలానుకుంటాడు. అందుకోసం తెగ కష్టపడతాడు. ఈ క్రమంలోనే దేవిక (సిజా రోజ్)ను అర్జున్ ప్రేమిస్తాడు.

తర్వాత నేషనల్ మ్యాచ్ కోసం దేవికకు దూరంగా వెళ్లి అర్జున్ వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది? నేషనల్ మ్యాచ్‌లో గెలిచిన అర్జున్ తాగుడుకు ఎందుకు బానిస అయ్యాడు? కోచింగ్ సెంటర్ పెడదామనుకున్న అర్జున్ గోల్ ఏమైంది? అర్జున్ దేవిక లవ్ స్టోరీ ఏమైంది? చివరికి అర్జున్ చక్రవర్తి జీవితంలో ఏమయ్యాడు? అనేది తెలియాలంటే అర్జున్ చక్రవర్తి సినిమాను చూడాల్సిందే.

తెలుగులో చాలా వరకు జోనర్స్ వస్తుంటాయి. కానీ, స్పోర్ట్స్ డ్రామా లు రావడం చాలా అరుదు. ఎందుకంటే హృదయానికి హత్తుకునేలా ఎమోషన్ పండితేనే అలాంటి సినిమాలు బాగా పేరు తెచ్చుకుంటాయి. అందులో అర్జున్ చక్రవర్తి కొంతమేర సక్సెస్ సాధించాడనే చెప్పొచ్చు.

సినిమాలోని ప్రధాన అంశాలు

అర్జున్ చక్రవర్తి సినిమా అంతా 1980-90 కాలం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఓ అనాథ నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఎలా అయ్యాడు, ఓ సమయంలో తాగుడుకు బానిసై మళ్లీ అదే కబడ్డీ ఆటతో తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడన్నదే అర్జున్ చక్రవర్తి మెయిన్ ప్లాట్.

80, 90 కాలం నాటి పరిస్థితులు, అప్పుడు స్పోర్ట్స్‌లో ఉండే క్రేజ్, ఆటగాళ్లు ఎదుర్కున్న పరిస్థితులను ఫస్టాఫ్‌‌లో బాగా చూపించారు. అప్పటి కాలానికి తగినట్లుగా ఆర్ట్ వర్క్ బాగుంది. అయితే, హీరోయిన్‌తో వచ్చే లవ్ ట్రాక్ రొటీన్‌గా ఉంటుంది. పెద్దగా కొత్తదనం కనిపించదు. సీన్లన్నీ రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సాగుతాయి.

గెలుపు, ఓటమి, గెలుపు ఇలాంటి స్క్రీన్ ప్లేతోనే ఈ సినిమా సాగుతుంది. అక్కడక్కడ సాగదీతగా అనిపించవచ్చు. కథ రొటీన్‌గా అనిపిస్తుంది. అయితే, ఎమోషన్ బాగానే పండింది. సీన్లతో డ్రామా వర్కౌట్ అయింది. ఊహించేలానే సన్నివేశాలు ఉంటాయి. క్లైమాక్స్ పర్వాలేదు. సంగీతం అంతగా వర్కౌట్ కాలేదు. కానీ, బీజీఎమ్ చాలా బాగుంది.

సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. సాంకేతిక నిర్మాణ విలువలు పర్వాలేదు. డైరెక్టర్ విక్రాంత్ రుద్ర టేకింగ్ ఓకే. ఇక అర్జున్ చక్రవర్తిగా విజయ రామరాజు నటన అద్భుతం. డిఫరెంట్ వేరియేషన్స్, దానికి తగినట్లుగా బాడీ ట్రాన్స‌ఫర్మేషన్‌తో వందకు వంద శాతం పాత్రకు న్యాయం చేశాడు.

దయానంద్ రెడ్డికి మంచి పాత్ర పడింది. కోచ్‌గా అజయ్ మెప్పించాడు. సిజా రోజ్ పర్లేదు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ స్టోరీ అయిన ఎమోషనల్ డ్రామాతో మెప్పించే మూవీ అర్జున్ చక్రవర్తి.

అర్జున్ చక్రవర్తి సినిమా, ఒక కబడ్డీ ఆటగాడి జీవితపు ఎత్తుపల్లాలను చక్కగా చూపిస్తుంది. కొన్ని బలహీనతలున్నప్పటికీ, చూడదగిన సినిమా అని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.