|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విడుదల అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేసిన మూవీ.. ఇదేం ట్విస్టురా అయ్యా అంటున్న నెటిజన్స్

Published: 12-05-2025, 9:26 AM
విడుదల అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేసిన మూవీ.. ఇదేం ట్విస్టురా అయ్యా అంటున్న నెటిజన్స్

కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా థియేటర్లలో సోసోగా రాణించింది. రిలీజ్ అయిన కొద్ది రోజులకే అది ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఓటీటీలోకి ఎంట్రీ.

2

రిలీజ్ అయిన నెల రోజులు కాకముందే డిజిటల్ రిలీజ్.

4

యూకేలో అద్దె విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ ప్రయాణం

నందమూరి కల్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి(Vijayashanthi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్‌ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటించింది. అయితే ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసులు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇక అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, పృథ్వీ రాజ్, చరణ్ రాజ్, భరత్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇక భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజై యావరేజ్‌గా నిలిచింది. అలా సోసో అనిపించుకున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఇప్పుడు సడెన్‌గా ఓటీటీ(OTT)లోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం (మే12) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

నెటిజన్ల స్పందన

అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, యూకేలో ఉన్నవాళ్లు అది కూడా అద్దె విధానంలో మాత్రమే ఈ మూవీని చూడొచ్చు. అయితే ఈ గురువారం లేదా శుక్రవారం ఇండియాలో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావొచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్స్ ఇదేం ట్విస్టురా అయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చిత్రం యొక్క ఓటీటీ విడుదల నెటిజన్లలో వివిధ అభిప్రాయాలను రేకెత్తిస్తోంది. అనూహ్యమైన ఈ విడుదల వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.