
📌 Key Points
- ఫిబ్రవరి 14న ‘సీతా పయనం’ విడుదల! అర్జున్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ.
- రైల్వే స్టేషన్లో తాగిన అభిమానితో అర్జున్ గొడవ.. వైరల్ అవుతున్న వీడియో!
- యాక్షన్ కింగ్ ఫైట్స్ అంటే మామూలుగా ఉండవు.. అభిమానిని ఎత్తి పడేసిన అర్జున్!
- దూరంగా పడేసినా వినకుండా మళ్ళీ మీదకు వచ్చిన అభిమాని.. షాక్ లో అర్జున్, భార్య!
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ఒక సంచలన వార్త! రైల్వే స్టేషన్లో ఓ అభిమానితో గొడవ జరిగిందని సమాచారం. అసలేం జరిగిందో తెలుసుకుందామా? పూర్తి వివరాల్లోకి వెళ్తే…
రైల్వే స్టేషన్లో అర్జున్ కు ఎదురైన అనుభవం!
Arjun Sarja : యాక్షన్ కింగ్ అర్జున్ ఎన్నో ఏళ్లుగా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. దర్శకుడిగా కూడా పలు సినిమాలతో మెప్పించారు. అర్జున్ ఇప్పుడు దర్శకుడిగా తన కూతురుని హీరోయిన్ గా పెట్టి సీతా పయనం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.(Arjun Sarja)
ఫ్యాన్ అత్యుత్సాహం.. ఆగ్రహించిన అర్జున్!
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ అభిమాని వల్ల తను పడ్డ ఇబ్బంది గురించి తెలిపాడు యాక్షన్ కింగ్ అర్జున్.
‘సీతా పయనం’ సినిమాతో కూతురు ఎంట్రీ!
అర్జున్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ తో నేను ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఉన్నాయి. నాకు కూడా అలాంటి సంఘటన జరిగింది. ఓ సారి రైల్వే స్టేషన్ లో ఒక అభిమాని చెయ్యి పట్టుకొని లాగుతున్నాడు. వదలట్లేదు గట్టిగా పట్టుకున్నాడు. పక్కన నా వైఫ్ కూడా ఉంది. నేను వెళ్ళాలి. వాడేమో మీ ఫ్యాన్, మీ సినిమా గ్రేట్ అది ఇది అని చెప్తున్నాడు. అతను తాగి ఉన్నాడు. అప్పటికి ట్రైన్ వచ్చేసింది. మా ఆవిడని ట్రైన్ ఎక్కమని చెప్పి అతన్ని ఎత్తి దూరంగా పడేసాను. నాకు చాలా కోపం ఎక్కువ. అతను మా ఊరికి వచ్చి మమ్మల్నే కిందేస్తారా అని నా మీదకు వచ్చాడు. పోరా నువ్వు అని తిట్టి వెళ్ళిపోయాను అని తెలిపాడు.
అర్జున్ గారి అభిమానితో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘సీతా పయనం’ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


