|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్ మెన్’ వద్దనుకున్న అర్జున్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Published: 15-02-2026, 11:05 AM
షాకింగ్: ఇండస్ట్రీపై కోపంతో 'జెంటిల్ మెన్' వద్దనుకున్న అర్జున్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
  • దర్శకుడిగా మారిన అర్జున్ సర్జా, ‘సీతా పయనం’ ద్వారా తన కుమార్తె ఐశ్వర్యను తెలుగు తెరకు పరిచయం చేశారు.
  • ఒకానొక సమయంలో వరుస డిజాస్టర్ల వల్ల ఇండస్ట్రీపై కోపం వచ్చిందని అర్జున్ తెలిపారు.
  • శంకర్ ‘జెంటిల్ మెన్’ కథ నచ్చకపోతే వదిలేద్దామని చెప్పినా, కథ విన్నాక ఆశ్చర్యపోయానని అర్జున్ అన్నారు.
  • ‘జెంటిల్ మెన్’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చింది.

అర్జున్ సర్జా ఒకానొక సమయంలో ఇండస్ట్రీపై కోపంతో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్ మెన్’ సినిమాను రిజెక్ట్ చేశారట. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆయన ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

దర్శకుడిగా మారిన అర్జున్ సర్జా

Arjun Sarja: అర్జున్ సర్జ నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈయన దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈయన దర్శకత్వంలో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే తాజాగా అర్జున్ సర్జా (Arjun Sarja)దర్శకత్వంలో తాజాగా సీతా పయనం (Seetha Payanam)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు .ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ విడుదల అయ్యి మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో చిత్ర బృందం తాజాగా థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అర్జున్ తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన తండ్రి నటుడిగా దాదాపు 200 సినిమాలలో నటించారు కానీ ఆయన మాత్రం నేను ఇండస్ట్రీలోకి రావడానికి ఇష్టపడలేదు నన్ను పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకున్నారని అర్జున్ తెలిపారు కానీ తను మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒకానొక సమయంలో వరుస డిజాస్టర్ సినిమాలు వచ్చాయి ఆ సమయంలో ఇండస్ట్రీపై తనకు చాలా కోపం వచ్చింది. అదే సమయంలోనే శంకర్ జెంటిల్ మెన్ (Gentle men)సినిమా గురించి చెప్పారు అప్పటికి శంకర్ కొత్త వ్యక్తి అతనితో సినిమా చేయడం నాకు నచ్చలేదు. వరుస డిజాస్టర్లు రావడంతో జెంటిల్ మెన్ సినిమాని రిజెక్ట్ చేశానని అర్జున్ తెలిపారు.

ఇండస్ట్రీపై కోపంతో జెంటిల్ మెన్ రిజెక్ట్

ఆ సమయంలో డైరెక్టర్ శంకర్ సర్ ఒకసారి వినండి కథ నచ్చకపోతే వదిలేద్దాం అంటూ మాట్లాడారు. ఇక కథ విని ఈ సినిమా వద్దని చెబుదామనుకొని కథ విన్నాను కథ చెబుతుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ కథను ఎలారా వద్దని చెప్పేది అనుకున్నాను. ఇలాంటి అద్భుతమైన కథను నేను రిజెక్ట్ చేస్తానని చెబితే ఎవరైనా నన్ను కొడతారని ఆ సినిమాకు ఒప్పుకున్నాను కట్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది అంతే కాకుండా స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చిందని అర్జున్ తెలిపారు.

దర్శకుడిగా శంకర్ మొదటి సినిమా..

ట్విస్ట్: సినిమా చేసి అవార్డు గెలుచుకున్న అర్జున్

సినిమాలలోకి రాకుండా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న నేను ఇలా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాను అంటూ ఈయన జెంటిల్ మెన్ సినిమా వెనుక ఉన్న స్టోరీని బయట పెట్టడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే ఈ సినిమా చేయకపోయి ఉంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేవారు అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చారు మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు .ఈ సినిమాలో అర్జున్ జోడిగా మధుబాల నటించిన విషయం తెలిసిందే . ఈ సినిమా 1993వ సంవత్సరంలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

చివరికి, అర్జున్ సర్జా ‘జెంటిల్ మెన్’ సినిమా వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ సినిమా చేయకుండా ఉంటే చాలా బాధపడేవాడినని ఆయన అన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.