|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కొరియోగ్రాఫర్‌ని పెళ్లి చేసుకోబోతున్న బుల్లి ‘అరుంధతి’

Published: 10-08-2025, 6:16 AM
కొరియోగ్రాఫర్‌ని పెళ్లి చేసుకోబోతున్న బుల్లి 'అరుంధతి'

‘అరుంధతి’ సినిమాలో బాలనటిగా నటించి పేరు తెచ్చుకున్న దివ్య నగేశ్, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్‌తో వివాహం చేసుకోబోతోంది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

‘అరుంధతి’ బాలనటి వివాహం

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది పెద్దోళ్లు అయిపోయారు. కొందరు నటులైతే మరికొందరు వేర్వేరు ఫ్రొఫెషన్స్‌లో సెటిల్ అయిపోయారు. అసలు విషయానికొస్తే ‘అరుంధతి’ సినిమాలో బాలనటిగా చేసిన దివ్య ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ప్రస్తుతం తన ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. ఇంతకీ పెళ్లెప్పుడు? చేసుకోబోయే కుర్రాడు ఎవరనేది చూద్దాం.

తెలుగు-తమిళ మూలాలున్న కుటుంబానికి చెందిన దివ్య నగేశ్.. ‘అరుంధతి’ సినిమాలో చిన్న జేజమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంతో పాటు అపరిచితుడు, సింగం పులి తదితర మూవీస్ కూడా చేసింది. ప్రస్తుతం డ్యాన్సర్, మోడల్‌గా చేస్తూ నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. గత ఐదేళ్లుగా సహనటుడు, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్‌ని ప్రేమిస్తున్న దివ్య.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది. మరో 8 రోజుల్లో అంటే ఆగస్టు 18న పెళ్లి చేసుకోబోతుంది.

ఐదేళ్ల ప్రేమాయణం

ఈ క్రమంలోనే వెడ్డింగ్ ఫొటోషూట్స్‌లో దివ్య బిజీగా ఉంది. అలానే తన లేడీ ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈమెకు అప్పుడే శుభాకాంక్షలు చెబుతున్నారు. స్వతహాగా ఈమె పేరు దివ్య నగేశ్.. కానీ దివ్య అరుంధతిగా ఇన్ స్టాలో పేరు మార్చుకుంది. అయితే ‘అరుంధతి’లో చేసిన బాలనటికి పెళ్లయిపోతుంది కానీ ఇదే మూవీలో చేసిన అనుష్క మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంది. మరి స్వీటీ అసలు వివాహం చేసుకుంటుందో లేదో?

పెళ్లి తేదీ, వేడుకలు

చిన్నతనంలోనే అరుంధతి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దివ్య, ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెడుతోంది. అజయ్ కుమార్ తో ఆమెకు సుఖమైన దాంపత్య జీవితం ఉండాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.