|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: స్టార్ హీరో అరవింద్ స్వామికి పక్షవాతం! కోలుకున్నదిలా? మామూలు రీఎంట్రీ కాదుగా!!

Published: 23-02-2026, 11:05 PM
షాకింగ్: స్టార్ హీరో అరవింద్ స్వామికి పక్షవాతం! కోలుకున్నదిలా? మామూలు రీఎంట్రీ కాదుగా!!
  • 90లలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న అరవింద్ స్వామికి రోజా, బొంబాయి సినిమాలతో భారీ గుర్తింపు!
  • కెరీర్ పీక్స్‌లో ఉండగా పాక్షిక పక్షవాతం.. 18 నెలలు నరకం చూసిన అరవింద్ స్వామి!
  • ఆయుర్వేద వైద్యంతో మళ్ళీ కోలుకున్న అరవింద్ స్వామి.. తన అనుభవాలను స్వయంగా వెల్లడి!
  • తని ఒరువన్ రీఎంట్రీతో విలన్‌గా దుమ్మురేపిన అరవింద్.. ధృవలో రామ్ చరణ్‌తో కలిసి బ్లాక్‌బస్టర్ హిట్!

టాలీవుడ్ షాకింగ్ న్యూస్! ఒకప్పుడు లవర్ బాయ్‌గా మెప్పించిన అరవింద్ స్వామి పక్షవాతానికి గురయ్యారా? ఎలా కోలుకున్నారు? రీఎంట్రీలో విలన్‌గా ఎలా మెప్పించారో తెలుసా? అయితే చదవండి!

లవర్ బాయ్ టు స్టార్ హీరో: అరవింద్ స్వామి జర్నీ!

90వ దశకంలో లవర్ బాయ్ గుర్తింపును సంపాదించుకున్న వారిలో అరవింద స్వామి ఒకరు. ఈయనకు రోజా, బొంబాయి సినిమాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఈ రెండు సినిమాలతో తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కెరీర్ జెట్ స్పీడులో ముందుకు సాగుతున్న సమయంలోనే ఈ హీరోకి చిన్న గాయం అయింది. దానితో ఈ నటుడికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది.

పీక్ కెరీర్‌లో పక్షవాతం: అరవింద్ స్వామి షాకింగ్ నిజాలు!

ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరం అయిన అరవింద స్వామి మళ్లీ సినిమాల్లో నటిస్తూ మంచి జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు. తాజాగా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన తనకు పక్షవాతం వచ్చిన తర్వాత ఎలాంటి బాధలను ఎదుర్కొన్నాను, అందులో నుండి ఎలా బయటపడ్డాను అనే దాని గురించి వివరించాడు. అరవింద స్వామి మాట్లాడుతూ… నాకు పాక్షికంగా పక్షవాతం వచ్చింది. దానితో నేను ఎంతో బాధపడ్డాను. 18 నెలల పాటు నన్ను ఆ బాధ వెంటాడింది. ఆ తర్వాత నేను ఆయుర్వేద వైద్యం తీసుకున్నాను.

ఆయుర్వేదంతో రీఎంట్రీ: విలన్‌గా దుమ్మురేపిన అరవింద్!

ఆ వైద్యం నా శరీరంపై ఎంతో బాగా పనిచేసింది. ఎంతో ప్రాచీరమైన ఆయుర్వేదం నేను బాగు కావడానికి దోహద పడింది. అందరికీ ఇది సరైనదని నేను చెప్పను, కానీ నాపై మాత్రం అద్భుతంగా పనిచేసిందని అరవింద స్వామి చెప్పుకొచ్చాడు. ఇక ఈ నటుడికి రీ ఎంట్రీలో తమిళంలో రూపొందిన తని ఒరువన్ మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత ఇదే సినిమాను తెలుగులో రామ్ చరణ్ హీరోగా ధ్రువ అనే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో కూడా ఈయన విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో తెలుగులో కూడా రీ ఎంట్రీలో భాగంగా ఈ నటుడికి మంచి గుర్తింపు దక్కింది.

అరవింద్ స్వామి గారి పోరాట స్ఫూర్తి నిజంగా అభినందనీయం. ఆయన కెరీర్ ఇలాగే విజయవంతంగా కొనసాగాలని ఆశిద్దాం. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.