
📌 Key Points
- ఆశా భోస్లే నటించిన ఏకైక చిత్రం ‘మై’ (2013)
- ఆమె 20 భాషల్లో 12 వేలకు పైగా పాటలు పాడారు
- ఆశా భోస్లేకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది
- ఆమె గాయనిగానే కాకుండా నటిగా కూడా గుర్తింపు పొందారు
ప్రముఖ గాయని ఆశా భోస్లే ఇకలేరు. ఆమె మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆమె గాయనిగానే కాకుండా నటిగా కూడా ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా గురించే ఈ కథనం.
ఆశా భోస్లే నటించిన ఏకైక చిత్రం
Asha bhosle:సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న గాయని ఆశాభోస్లే మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఈమె నటించిన చిత్రం. ఆశా భోస్లే అనగానే మనకు కేవలం ఆమె గాయని అని మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఆమె ఒక వ్యాపారవేత్త. అంతేకాదు నటి కూడా.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని ఆశ్చర్యపరిచింది ..మరి అలాంటి మెలోడీ క్వీన్ ఆశాభోస్లే నటించిన ఆ చిత్రం ఏంటి? ఆ విశేషాలు ఏంటో? ఇప్పుడు చూద్దాం.
ఆశా భోస్లే గాయని గానే కాకుండా నటిగా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. పైగా ఈమె తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో నటించిన ఏకైక చిత్రం ‘మై’. ప్రధాన మరాఠీ – హిందీ ద్విభాష చిత్రం ఇది. 2013లో వచ్చిన ఈ సినిమాలో ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. అంతేకాదు ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి . మహేష్ కొడియాల్ దర్శకత్వం వహించిన ఈ డ్రామా సినిమాలో పద్మిని కొల్హాపురే, రామ్ కపూర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఆశా భోస్లే నటించిన ఏకైక చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా కుటుంబ సంబంధాలు, వృద్ధాప్య సమస్యలను ప్రతిబింబిస్తుంది. అలా మొత్తానికి అయితే నటిగా కూడా తనను తాను ఆవిష్కరించుకుంది ఆశాభోస్లే.
గాయనిగా ఆమె సుదీర్ఘ ప్రయాణం
ఆశా భోస్లే 92 సంవత్సరాల వయసులో కన్నుమూసినా.. 70 సంవత్సరాలకు పైగా సినీ ప్రయాణంలో సుమారుగా 20 భాషలలో 12 వేలకు పైగా పాటలు పాడి అందరిని అబ్బురపరిచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు , రెండు నేషనల్ అవార్డులు, నాలుగు బీఎఫ్జేఏ అవార్డులు, 18 మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఒక జీవిత సాఫల్య పురస్కారంతో పాటు అనేక పురస్కారాలు అందుకున్న ఈమె రెండు గ్రామీ నామినేషన్లను కూడా పొందారు.. పద్మ విభూషణ్ కూడా అందుకున్న ఈమె గాయనిగా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు.
ఆమె అందుకున్న అవార్డులు, గుర్తింపులు
ఇకపోతే నేడు ఆశా భోస్లే అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణం సినీ ప్రపంచాన్ని దుఃఖంలో ముంచేసింది. ఆమె మరణంతో సంగీత ప్రియులు దుఃఖింతలవుతున్నారు. ఇక పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ఆశా భోస్లే మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆమె గాయనిగానే కాకుండా నటిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆమె పాటలు, సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.


