
📌 Key Points
- లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గుండెపోటుతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు.
- ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు, ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.
- ఆశా భోస్లే అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారని మనవరాలు జానై భోస్లే తెలిపారు.
- ఆశా భోస్లే త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.
ప్రముఖ గాయని ఆశా భోస్లే గుండెపోటుకు గురయ్యారు. ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఆశా భోస్లేకు గుండెపోటు: ఆసుపత్రిలో చేరిక
Singer Asha Bhosle: చిత్ర సీమలో వేల సంఖ్యలో పాటలు పాడి తన గాత్రంతో శ్రోతలను అలరించిన లెజెండ్ సింగర్ ఆశాభోస్లే గుండెపోటుకి గురయ్యి.. హాస్పిటల్లో చేరారు. కొద్దిసేపటి క్రితం ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం హాస్పిటల్ అత్యవసర వైద్య విభాగంలో ఆశాభోస్లే చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే ఆశాభోస్లేకి గుండెపోటు అంటూ అటు న్యూస్ ఛానల్స్ లో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈమె మనవరాలు జానై భోస్లే గోప్యత కోరుతూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది . మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన ఆశాభోస్లే ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన హాస్పిటల్ వైద్యుడు ప్రతిత్ సమ్దాని ఈ విషయంపై మాట్లాడుతూ.. “ఆశాభోస్లేకి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నాము. త్వరలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి పై మరిన్ని వివరాలు వెల్లడిస్తాము” అంటూ తెలిపారు. ఇకపోతే తమ అభిమాన గాయకురాలికి గుండెపోటు వచ్చిందని తెలియడంతో అటు ప్రముఖులు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు..
ఇకపోతే ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలకు గాయని మనవరాలు జానై భోస్లే ఇంస్టాగ్రామ్ వేదికగా.. తన అమ్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఒక అప్డేట్ పంచుకున్నారు. “మా అమ్మమ్మ ఆశా భోస్లే తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్లో చేరారు. దయచేసి మా గోప్యతను గౌరవించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకొని బయటకు వస్తుందని ఆశిస్తున్నాము. మేము త్వరలోనే మీకు సానుకూల సమాచారాన్ని అందజేస్తాము..” అంటూ ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆశా భోస్లే మనవరాలు ఇచ్చిన ఈ సమాచారంతో ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు త్వరగా ఆశాభోస్లే కోలుకోవాలి అంటూ ప్రార్థిస్తున్నారు.
వైద్యుల ప్రకటన: ఆరోగ్య పరిస్థితి విషమం
ఆశాభోస్లే భారతీయ సంగీత రంగంలో అత్యంత గొప్ప, బహుముఖ ప్రతిభ కలిగిన గాయకులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. దాదాపు 70 ఏళ్లకు పైగా సాగిన ఈమె కెరియర్లో అనేక భాషల్లో విభిన్న శైలిలో వేలాది పాటలు పాడి శ్రోతలను అలరించారు. ముఖ్యంగా ఈమె గాత్రం భారతీయ సంగీతానికి ప్రత్యేక గుర్తింపును అందించింది. ఇక ఈమె కెరియర్ విషయానికొస్తే.. 1943లో వచ్చిన మరాఠీ చిత్రం ‘మాజాబాల్’ అనే చిత్రంలో పాట పాడి తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1948లో హిందీ చిత్రమైన ‘చునారియా’ లో “సావన్ ఆయా” పాటతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈమె.. గానంతోనే కాదు నటనలో కూడా తన ప్రతిభను చూపించారు.
2013లో వచ్చిన మరాఠీ చిత్రం ‘మై’ లో నటిగా అరంగేట్రం చేశారు. అంతేకాదు వంటకాలలో కూడా ఈమెకు మంచి ఆసక్తి ఉంది . దుబాయ్, కువైట్ వంటి ప్రాంతాలలో ఆశాభోస్లే పేరుతో కొన్ని ఫుడ్ రెస్టారెంట్లు కూడా ఉండడం విశేషం. దేశీ విదేశీ భాషల్లో మొత్తం 20కి పైగా భాషల్లో పాటలు పాడిన ఈమె.. 2006లో 12 వేల పంటలు పాడినట్లు స్వయంగా తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం 92 సంవత్సరాల వయసులో గుండెపోటుకు గురవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మనవరాలి విజ్ఞప్తి: గోప్యత కోరిన జానై భోస్లే
Tags Asha Bhosle bollywood Singer Share
ప్రస్తుతం ఆశా భోస్లే కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ తన గానంతో అలరించాలని ఆశిద్దాం.


