
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ఓ పసివాడి చివరి కోరిక తీర్చడంపై పేర్ని నాని రాజకీయం.
- పేర్ని నాని వ్యాఖ్యలపై జబర్దస్త్ కిరాక్ ఆర్పీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
- చావుబతుకుల్లో ఉన్న పిల్లాడి సెంటిమెంట్‌ను అవహేళన చేయడాన్ని ఆర్పీ ఖండించారు.
- పవన్ కళ్యాణ్ గత సేవా కార్యక్రమాలను గుర్తుచేసిన కిరాక్ ఆర్పీ.
పవన్ కళ్యాణ్ ఓ పసివాడి చివరి కోరిక తీర్చిన మానవతా దృక్పథాన్ని వైఎస్ఆర్సిపి నేత పేర్ని నాని రాజకీయం చేయడంపై జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేర్ని నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రాజకీయాల కోసం దిగజారుడు వ్యాఖ్యలు తగదని హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ మానవత్వంపై పేర్ని నాని వ్యాఖ్యలు
Kiraak RP Fires on Perni Nani: సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ వైఎస్ఆర్సిపి నేత పేర్ని నానిపై ఫైర్ అయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పసివాడి చివరి కోరికను, పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని రాజకీయం చేస్తూ మాట్లాడటంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విషయంలోకి వెళ్తే నిరంజన్ అనే కుర్రాడు వింత వ్యాధితో బాధపడుతూ, మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ పిల్లాడికి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. చివరి గడియల్లో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ ని చూడాలి” అని కోరుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ .. క్షణం ఆలస్యం చేయకుండా ఆ పిల్లాడి వద్దకు వెళ్లారు. ఆ పిల్లాడి చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకున్నారు. ఎంతో ప్రేమగా ఓదార్చారు. శ్రీవారి కండువా, శాలువా కప్పి, నుదుటన బొట్టు పెట్టి పరామర్శించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.
అయితే ఇదే విషయంపై పేర్ని నాని మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసైనికుల బాధలు కనబడవు, వినపడవన్న పేర్ని నాని.. తెలంగాణలోని అభిమాని మాత్రం కనిపిస్తారని ఎద్దేవా చేశారు.దీనితో పేర్ని నానిపై ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు కిరాక్ ఆర్పీ.
కిరాక్ ఆర్పీ తీవ్రస్థాయిలో ధ్వజం
ఆ పిల్లాడేమి వైసీపీలో ఉండే పెయిడ్ ఆర్టిస్ట్ కాదు.. ఎంత అహంకారం మీది? ఇలా మాట్లాడటానికి నోరెలా వచ్చింది పేర్ని నాని?” అంటూ ఆర్పీ విరుచుకుపడ్డారు. “నిన్ను తిట్టాలంటే ఈ దేశంలో బూతులు సరిపోవు.. కొట్టాలంటే చెప్పులు సరిపోవు. నిన్ను ఏ విధంగా శిక్షించాలంటే.. ‘అరుంధతి’ సినిమాలో పశుపతిని మదమెక్కిన గుర్రానికి కట్టి ఈడ్చుకెళ్లినట్టు ఈడ్చుకెళ్లాలి. రాజకీయం ఉంటే ఎన్నికల్లో చూసుకోవాలి, విమర్శలు ఉంటే పాలనపై చేయాలి. కానీ చావుబతుకుల్లో ఉన్న పిల్లాడి సెంటిమెంట్‌ను, ఒక మనిషి ఆఖరి కోరికను కూడా అవహేళన చేస్తారా?” అని ప్రశ్నించారు.ఈరోజు రేషన్ బియ్యం అమ్ముకుని, ఆ డబ్బులతో అడ్డదిడ్డంగా తిని బలిసి కొట్టుకుంటున్న మాటలు ఇవి. జగన్ మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ, భజన చేస్తూ, పదవుల కోసం మదమెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ గారి సేవా గుణాన్ని గుర్తు చేస్తూ ఆర్పీ కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు గతంలో పహల్గామ్ దాడిలో అమరుడైన మధుసూదన్ రావు గారి కుటుంబానికి పవన్ గారు స్వయంగా వెళ్లి పరామర్శించి రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన మురళీనాయక్ కుటుంబానికి రూ. 25 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు.మరి జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారు? అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి, రాజకీయం చేసి, విగ్రహాల పేరుతో డ్రామాలు ఆడారు. గుంటూరు మిర్చి రైతులు గానీ, పత్తి రైతులు గానీ ఎవరైనా జగన్‌ను రమ్మని పిలిచారా? అంతా పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్ ఆర్టిస్టులతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కదా మీ పని? అందుకే ప్రజలు మీకు కేవలం 11 సీట్లు ఇస్తే.. పవన్ కళ్యాణ్ గారిని 21 సీట్లతో మీ మెడ మీద 10 మెట్లు పైన కూర్చోబెట్టారని గుర్తుచేశారు.
రాజకీయాల్లో దిగజారుడుతనంపై ఆర్పీ ఆగ్రహం
ప్రతి కుటుంబంలోనూ ఎమోషన్స్ ఉంటాయి, చనిపోయిన పూర్వీకులను సంక్రాంతి పండుగ నాడు గుర్తుచేసుకుని గౌరవిస్తాం. అలాంటి సంస్కృతి ఉన్న దేశంలో, ఒక చిన్నారి ఆఖరి కోరికను అవమానించిన మిమ్మల్ని ప్రజలు క్షమించరు.అంటూ ఫైర్ అయ్యారు.ఇక చివరగా పవన్ కళ్యాణ్ గారికి, జనసైనికులకు ఉద్దేశిస్తూ “సార్, మీరు ఒక శిఖరం. మీరు కేవలం చిరంజీవి గారి తమ్ముడిగానో, పవర్ స్టార్ ఇమేజ్ తోనో ఈ స్థాయికి రాలేదు. మీకున్న పెద్ద మనసే మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది. ఇలాంటి నీచమైన రాజకీయం చేసే వ్యక్తులకు 2029 ఎన్నికల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి, మళ్లీ పాతాళానికి తొక్కడం ఖాయం.”అంటూ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని రాజకీయం చేయడంపై కిరాక్ ఆర్పీ ఆగ్రహం వ్యక్తం చేయడం, రాజకీయాల్లో విలువలు పడిపోతున్న తీరును స్పష్టం చేస్తోంది. ఇటువంటి వ్యాఖ్యలు సమాజానికి మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


