|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగబంధం ట్రైలర్ సృష్టించిన సునామీ! విరాట్ కర్ణ విశ్వరూపం చూశారా?

Published: 19-06-2026, 10:23 PM
నాగబంధం ట్రైలర్ సృష్టించిన సునామీ! విరాట్ కర్ణ విశ్వరూపం చూశారా?
  • ‘నాగబంధం’ ఒక హై-బడ్జెట్ పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం.
  • విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మేనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
  • అద్భుతమైన గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది.
  • ఈ చిత్రం జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మైథలాజికల్ మిస్టరీ, విజువల్ వండర్‌గా రూపొందుతున్న ‘నాగబంధం’ చిత్రం ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విరాట్ కర్ణ హీరోగా, నభా నటేశ్, ఐశ్వర్య మేనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జులై 3న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

నాగబంధం: విజువల్ వండర్, మిస్టరీ థ్రిల్లర్

Nagabandham Trailer: టాలీవుడ్‌లో విజువల్ వండర్స్, మిస్టరీ థ్రిల్లర్స్‌కు ఎప్పుడూ క్రేజీ డిమాండ్ ఉంటుంది. కార్తికేయ-2, కాంతార, హనుమాన్ వంటి సినిమాలు క్రియేట్ చేశాయో తెల్సిందే. ఇప్పుడు అదే కోవలో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి మరో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ సిద్ధమైంది. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న హై-బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’. అడ్వెంచరస్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఈ చిత్రంలో విరాట్ కర్ణ సరసన  నభా నటేశ్, ఐశ్వర్య మేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ ఆడియన్స్‌కు దగ్గరైన నభా నటేశ్, ‘స్పై’ చిత్రంతో మెప్పించిన ఐశ్వర్య మేనన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని స్పష్టమవుతోంది. వీరితో పాటు టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు  కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుండటం సినిమాకు మెయిన్ ఎసెట్.ఇక ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తుండగా, కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమాను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినట్లు  అర్థమవుతోంది. పురాతనమైన రహస్యాలు, శతాబ్దాల నాటి నాగబంధం సంప్రదాయం, ఆ గూఢ చారిత్రక సత్యాల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమా రేంజ్‌ను మరో లెవెల్ కి తీసికెళ్ళాయి.గతంలో వచ్చిన  కల్కి 2898 AD,బాహుబలి  వంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాల తరహాలోనే, ఈ నాగబంధం కూడా ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేలా కనిపిస్తోంది. టీజర్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్, ఇప్పుడు ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలను స్కై హైకి తీసుకెళ్లారు.

తారాగణం, సాంకేతిక బృందం

ఇకపోతే ఈ విజువల్ మిస్టరీ అడ్వెంచర్ రాబోయే జులై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ ఏడాది జులై నెలలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్‌లో ఇదొకటిగా ట్రెండ్ అవుతోంది.ఇక సినిమా ప్రమోషన్స్ కూడా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సౌత్ టూ నార్త్ అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మిస్టరీ ఎలిమెంట్స్‌ను ఇష్టపడే సినీ ప్రియులకు నాగబంధం ఖచ్చితంగా ఒక ఐ-ఫీస్ట్ కానుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు కామన్ ఆడియన్స్‌లోనూ ఈ మిస్టరీ థ్రిల్లర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందనే ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతోంది.చూడాలి మరి భారీ అంచనాలని  ఈ సినిమా వాటిని అందుకుంటుందో లేదో !

కార్తికేయ-2, కాంతార వంటి చిత్రాల కోవలో ‘నాగబంధం’ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జులై 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.