|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆశా భోస్లే ఇక లేరు! దిగ్భ్రాంతిలో టాలీవుడ్.. చిరంజీవి, ఎన్టీఆర్ సంతాపం!

Published: 12-04-2026, 7:35 AM
ఆశా భోస్లే ఇక లేరు! దిగ్భ్రాంతిలో టాలీవుడ్.. చిరంజీవి, ఎన్టీఆర్ సంతాపం!
  • లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూశారు.
  • ఆమె మృతికి చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
  • భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
  • ఆశా భోస్లే కుటుంబానికి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రముఖ గాయని ఆశా భోస్లే ఇకలేరు. ఈమె మరణం పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తూ పోస్టులు పెట్టారు.

ఆశా భోస్లే మృతికి టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

Asha BhosleDeath: లెజెండరీ సింగర్ ఆశాబోస్లే ఇక లేరనే వార్త అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఈమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఆశాభోస్లే మరణించారని తెలుస్తోంది. ఇక ఈమె మరణ వార్త తెలిసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా వేదికగా ఈమెకు సంతాపం తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్స్ సైతం ఆశాభోస్లే మరణం పట్ల నివాళులు అర్పించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి(Chiranjeevi) ఈమె మరణం పై స్పందిస్తూ.. భారతీయ చిత్ర పరిశ్రమ ఒక అమూల్యమైన సింగర ను కోల్పోయింది ఆశాభోస్లే గారి గాత్రం తరతరాలుగా ఎన్నో భావోద్వేగాలను మోసుకొచ్చింది. ఆమె ప్రతిపాటకు ఒక ప్రత్యేకమైన సౌందర్యాన్ని తీసుకువచ్చారు. ఆమెలోని బహుముఖ ప్రజ్ఞనను నేను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను అంటూ చిరంజీవి ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

ఎన్టీఆర్ సైతం ఆశాభోస్లే మరణం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. దశాబ్దాల కాలం పాటు ఆశాభోస్లే గారు భారతీయ సినిమాలకు ప్రాణంగా నిలిచారు. పరిశ్రమలో తరతరాలు పాటు నిలిచిపోయే అద్భుతమైన పాటలను మనకు అందించి వెళ్లిపోయారు. ఈమె మృతి బాధాకరం ఈమె మరణం పట్ల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. లెజెండరీ సింగర్ మరణం పై నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

చిరంజీవి నివాళులు

ఆశాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..

ప్రముఖ గాయని శ్రీమతి ఆశాభోస్లే కన్నుమూసారని తెలిసి చాలా చింతించాను ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘకాలం పాటు వివిధ భాషలలో పాటలను పాడిన అద్భుతమైన గాయని. తెలుగులో ఆశాజీ పాడిన గీతాలు తక్కువే అయినా హిందీ గీతాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సుపరిచితమే. శ్రీమతి ఆశా భోస్లే గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ సైతం తన ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఇలా వేల సంఖ్యలో పాటలను ఆలపిస్తూ తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఆ గొంతు మూగబోయిందనే వార్త అభిమానులకు మింగుడు పడలేదని చెప్పాలి.

Asha Bhosle ji’s voice has been a timeless companion to Indian cinema, carrying a spectrum of emotions across generations. I have always admired the effortless grace and versatility she brought to every song.

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి

Indian cinema has lost one of its most irreplaceable voices. My… pic.twitter.com/3zpUS7MqNj

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 12, 2026

ఆశా భోస్లే మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె పాడిన పాటలు ఎప్పటికీ మన హృదయాలలో నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.