
📌 Key Points
- ఎన్నారై ధర్మేంద్ర నుంచి రూ.9.35 కోట్లు మోసం చేశారనే ఆరోపణలు.
- హైదరాబాద్ సీసీఎస్ లో అషురెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు.
- పరువు నష్టం కలిగించే కథనాలు ప్రసారం చేయొద్దని మీడియాకు హైకోర్టు ఆదేశం.
- కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అషురెడ్డి హెచ్చరిక.
బిగ్ బాస్ సెలబ్రిటీ అషురెడ్డిపై నమోదైన చీటింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నారై ధర్మేంద్ర నుంచి రూ.9.35 కోట్లు మోసం చేశారనే ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, అషురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మీడియాకు హైకోర్టు కొన్ని ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది.
అషురెడ్డిపై చీటింగ్ ఆరోపణలు, ఎఫ్ఐఆర్
Ashu Reddy:రామ్ గోపాల్ వర్మ స్పెషల్ ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ గా పేరు సొంతం చేసుకున్న అషురెడ్డి.. తన లుక్స్ తో జూనియర్ సమంతగా పేరు దక్కించుకుంది. బిగ్ బాస్ లో సందడి చేసి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఈమధ్య కమెడియన్ సుధీర్ తో కలిసి ఒక షోలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు కెరియర్ పరంగా బిజీగా మారిన ఈమెపై ఉన్నట్టుండి చీటింగ్ కేసు నమోదవడం ఒక్కసారిగా ఇండస్ట్రీని ఉలిక్కిపాటుకు గురి చేసింది.. ముఖ్యంగా లండన్ కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై నుంచి రూ.9.35 కోట్లు తీసుకొని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే కాకుండా డబ్బు మోసం చేసిందనే ఆరోపణలు ఆమెపై వచ్చాయి.
అందులో భాగంగానే ధర్మేంద్ర తండ్రి యెనుముల సత్యనారాయణ కూడా హైదరాబాద్ సీసీఎస్ లో కంప్లైంట్ చేశారు. దీనిపై విచారించిన పోలీసులు ఈమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దీంతో అషురెడ్డి హైకోర్టును ఆశ్రయించింది. ఒకవైపు మాత్రమే వాదనలు విని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎంతవరకు సమంజసం. తన ప్రమేయం లేకుండానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అంటూ క్యాష్ పిటిషన్ వేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే నేడు విచారణ జరిపిన హైకోర్టు మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అషురెడ్డి ఒక నోటు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి
ఇక ఆ నోట్ లో అషురెడ్డి..”గత కొన్ని రోజులుగా నాపై మీడియా, సోషల్ మీడియా, కంటెంట్ క్రియేటర్స్ ఆధారాలు లేని కథనాలు ప్రచారం చేస్తున్నారు. నాపై వచ్చిన ఆరోపణల కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. నా పరువుకు భంగం కలిగించే కంటెంట్ ప్రసారం చేయొద్దని హైకోర్టు కూడా ఆదేశించింది. ఇది గౌరవించాలని ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించద్దని మీడియా, నెటిజనులను కూడా కోరుతున్నాను. ముఖ్యంగా కోర్టు ఆదేశాల మేరకు నాపై ఉన్న అభ్యంతరకర పోస్టులు కూడా తొలగించాలి. కొత్తవి పబ్లిష్ చేయకుండా సహకరించాలి అని కోరుతున్నాను. నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ ఈమె చెప్పుకొచ్చింది.ఇక ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా ఈ కేసు విషయం బయటకు వచ్చిన వెంటనే మేము ఎలాంటి తప్పు చేయలేదని అషురెడ్డి తెలిపింది. అలాగే ఆమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి కూడా అషురెడ్డి అమాయకురాలు…తమ పరువుకు భంగం కలిగించేలా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత అషురెడ్డి మాట్లాడినట్లు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో మే నెల వరకు టైం ఇస్తే కోటిన్నర ఇస్తానని .. ఆ తర్వాత తన దగ్గర ఉన్నప్పుడు మిగతా డబ్బులు చెల్లిస్తానని ఆమె చెప్పినట్లు ఆ వీడియో సారాంశం .. మరొకవైపు ధర్మేంద్రకు సంబంధించిన ఆరు నిమిషాల వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు మాట్లాడుతూ.. అప్పు చేసి మరీ ఆమెకు డబ్బులు ఇచ్చాను. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదు పైగా బెదిరిస్తోంది . అందుకే కేసు పెట్టానని బాధితుడు మాట్లాడినట్లు ఉంది. మరి ప్రస్తుతం తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఆ తీర్పులో ఎలాంటి విషయాలు వెలువడనున్నాయో తెలియాల్సి ఉంది.
మీడియాకు హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, అషురెడ్డి పరువుకు భంగం కలిగించే కథనాలను ప్రసారం చేయవద్దని హైకోర్టు మీడియాను ఆదేశించింది. ఈ తీర్పుతో కేసు విచారణలో కొత్త మలుపు తిరిగింది.


