
టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నటిస్తున్న ‘వచ్చిన వాడు గౌతమ్’ సినిమా నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా పవర్ ఫుల్ పోస్టర్ విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
Key Points
అశ్విన్ బాబు బర్త్‌డే సందర్భంగా 'వచ్చిన వాడు గౌతమ్' నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల.
అశ్విన్ బాబు ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంటున్న పోస్టర్.
సినిమాలో రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.
హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయింది, త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్.
‘వచ్చిన వాడు గౌతమ్’ పోస్టర్ రిలీజ్
ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు (Ashwin Babu) డిఫరెంట్ జానర్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వచ్చినవాడు గౌతమ్’ (Vachina Vadu Gautham). దీనికి ఎంఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
నేడు హీరో అశ్విన్ బాబు బర్త్ డే (Birthday special) కావడంతో.. ఆ సందర్భంగా ‘వచ్చిన వాడు గౌతమ్’ నుంచి అశ్విన్ యెక్క పవర్ ఫుల్ పోస్టర్ (Powerful poster) రిలీజ్ చేశారు మేకర్స్. అశ్విన్ బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ఇదిలా ఉంటే.. ఇటివలే ఈ సినిమాకు సంబంధించిన భారీ బడ్జెట్ హైవోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ పూర్తి చేశారు. ఇందులో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్ తదితరులు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.
అశ్విన్ బాబు ఇంటెన్స్ లుక్
సినిమా విడుదల తేదీ త్వరలోనే
మొత్తంగా, ‘వచ్చిన వాడు గౌతమ్’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అశ్విన్ బాబు యొక్క పవర్ ఫుల్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.


