
మాంచెస్టర్ సిటీ ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ‘అతడు’ సందడి చేసింది. ఐవోరియన్ ఫుట్‌బాలర్ యాయా టౌరే గోల్స్‌కు ‘అతడు’ బీజీఎం, డైలాగ్‌లు జోడించి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనితో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయంగా చాటిచెప్పబడింది.
Key Points
ఐవోరియన్ ఫుట్‌బాలర్ యాయా టౌరే గోల్స్‌కు 'అతడు' బీజీఎం, డైలాగ్స్ మిక్స్ చేసి వీడియో రూపొందించారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీ ఈ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
56 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న మాంచెస్టర్ సిటీ పేజీలో తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపు లభించింది.
ఈ వైరల్ వీడియో ఇప్పటికే ఒక మిలియన్ వ్యూస్‌కు పైగా చేరుకొని ట్రెండ్ అవుతోంది.
మాంచెస్టర్ సిటీలో ‘అతడు’ సందడి
పశ్చిమ ఆఫ్రికాలోని ఐవోరియన్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు ‘యాయా టౌరే’ నెట్టింట వైరల్ అవుతున్నాడు. అందుకు ప్రధాన కారణం మహేష్ బాబు అతడు సినిమానే కావడం విశేషం. వివిధ మ్యాచ్‌లలో ఆయన చేసిన గోల్స్ ఒక వీడియోగా క్రియేట్ చేసి దానికి అతడు సినిమా బిజీఎమ్‌ను జోడించారు. ఆపై ఆడు మగాడ్రా బుజ్జి అంటూ తనికెళ్ల భరణి చెప్పే ఎలివేషన్ డైలాగ్స్‌ను కూడా మిక్స్ చేశారు. అయితే, ఆ వీడియోను చిన్నాచితక పేజీ షేర్ చేయలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీ (ఇంగ్లాండ్) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘పెను తుఫాను తలొంచి చూసే… తొలి నిప్పు కణం అతడే ‘ అంటూ తెలుగు డైలాగ్‌ను కూడా షేర్ చేసింది. 56 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఆ పేజీలో ఒక తెలుగు సినిమాకు చెందిన బీజీఎమ్‌తో పాటు అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్స్ చేర్చడం విశేషం.
యాయా టౌరే గోల్స్‌కు మహేష్ బాబు బీజీఎం
ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ జట్టుగా పేరుగాంచిన మాంచెస్టర్ సిటీ(Manchester City).. ప్రతిష్ఠాత్మకమైన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్(FIFA Club World Cup)- 2023 చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టీమ్‌కు చెందిన సోషల్‌మీడియా పేజీలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన డైలాగ్స్‌ను పంచుకోవడం గొప్ప విషయం. ఇప్పటికే ఆ వీడియో ఒక మిలియన్ వ్యూస్ చేరుకుంది.
అంతర్జాతీయంగా టాలీవుడ్ ఖ్యాతి
మాంచెస్టర్ సిటీ షేర్ చేసిన వీడియోలో యాయా టౌరే కొడుతున్న గోల్స్‌కు తనికెళ్ల భరణి డైలాగ్స్ జత కావడంతో ట్రెండ్ అవుతుంది. యాయా టౌరే ప్రస్తుతం సౌదీ అరేబియా జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు .
మాంచెస్టర్ సిటీ లాంటి అంతర్జాతీయ క్రీడా సంస్థ తెలుగు సినిమాను గుర్తించడం గొప్ప విషయం. ఇది టాలీవుడ్ ప్రభావాన్ని, మహేష్ బాబు స్టార్‌డమ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. తెలుగు సినిమాకు ఇది ఓ మైలురాయి.


