|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పోసాని తండ్రి ఆత్మహత్య వెనుక షాకింగ్ నిజం! పేకాట బానిసై..

Published: 14-07-2026, 3:56 PM
పోసాని తండ్రి ఆత్మహత్య వెనుక షాకింగ్ నిజం! పేకాట బానిసై..

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తన తండ్రి ఆత్మహత్యకు గల కారణాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తండ్రి పేకాటకు బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.

Key Points

1

పోసాని తండ్రి పేకాటలో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

2

పోసాని తన తండ్రి కూలీ అని చెప్పినందుకు చిన్నచూపు ఎదుర్కొన్నారు.

4

పోసాని 'ఆపరేషన్ అరుణా రెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

పోసాని తండ్రి ఆత్మహత్యకు కారణం

Posani:పోసాని కృష్ణ మురళి.. సెన్సేషన్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన.. రచయితగా సినిమా రంగంలో తన కెరియర్ ను మొదలుపెట్టి దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా కూడా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా వందకు పైగా చిత్రాలకు రచయితగా పనిచేసిన పోసాని.. ఎన్నో కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పరుచూరి బ్రదర్స్ వద్ద సహాయ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఎదుట ఎంతటి వ్యక్తి ఉన్నా సరే రాజా అని సంబోధించే నైజం అయినది. ఇకపోతే పోసాని కృష్ణ మురళి దగ్గర ఎంతోమంది దర్శకులు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసి .. నేడు ఇండస్ట్రీలో దర్శకులుగా స్టార్ పొజిషన్లో ఉండడం గమనార్హం.

ఇకపోతే చాలా రోజుల తర్వాత ఆపరేషన్ అరుణా రెడ్డి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ సినిమా జూలై 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజకీయాలు, సమాజంలోని లోపాలను ఎత్తిచూపే సందేశాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని పోసాని తీర్చిదిద్దారు. ఇకపోతే నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. మరొకవైపు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు న్యూస్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగానే తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పడ్డ అవమానాలు.. తన తండ్రి ఆత్మహత్యకు గల కారణాలను చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు పోసాని.

పోసాని ఎదుర్కొన్న అవమానాలు

సినిమా జర్నీ, వ్యక్తిగత విషయాల గురించి పోసాని మాట్లాడుతూ..” మీ నాన్న ఏం చేస్తారు? అని అడిగినప్పుడు మా నాన్న కూలీ అని చెప్పాను. ఓహ్.. కూలీ కొడుకువా అంటూ చాలా చిన్న చూపు చూసేవారు.మా నాన్న పేకాట ఆడేవారు. అందులో డబ్బులు అన్ని పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఏ రోజు ఎవరూ కూడా మాకు కనీసం అర్ద రూపాయి ఇచ్చినవాళ్లు లేరు. ఇక నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక స్థానాన్ని పొందిన తర్వాత నా దగ్గర సహాయం పొందిన వాళ్లు చాలా ఉన్నారు ..అది వేరే లెక్క” అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఎప్పుడు నవ్వుతూ గంభీరంగా పలకరించే పోసాని గుండెల్లో ఇంత బాధ ఉందా అంటూ అభిమానులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఆపరేషన్ అరుణా రెడ్డి సినిమా వివరాలు

పరుచూరి బ్రదర్స్ మధ్యలో నన్ను కూర్చోబెట్టినప్పుడు ఇక నేను ఇండస్ట్రీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. అంటూ తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి గల కారణాన్ని కూడా పోసాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పోసాని చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి ఆపరేషన్ అరుణా రెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఇకపోతే మెంటల్ కృష్ణ సినిమాలో నైటీతో అలరించిన ఈయన ఈ సినిమాలో ఏకంగా చీర కట్టి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఈయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

పోసాని తన గత బాధలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన తండ్రి ఆత్మహత్యకు పేకాటే కారణమని తెలిపారు. ఇప్పుడు తన సినిమా ద్వారా సందేశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.