|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Atlee: బడ్జెట్ ఇంకా ఫిక్స్ కాలేదు.. కానీ చాలా పెద్ద రేంజులో

Published: 14-06-2025, 10:43 AM
Atlee: బడ్జెట్ ఇంకా ఫిక్స్ కాలేదు.. కానీ చాలా పెద్ద రేంజులో

అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా గురించి తాజా అప్డేట్స్ బయటకు వచ్చాయి. అట్లీ ఈ సినిమాను దేశంలోనే ఖరీదైన చిత్రంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

Key Points

1

అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా.

2

హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని ఉపయోగించనున్నారు.

4

దీపికా పదుకొణె, మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్ నటన.

అట్లీ-అల్లు అర్జున్ సినిమా విశేషాలు

అల్లు అర్జున్.. ‘పుష్ప 2’ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇదివరకే రెండు వీడియోలు రిలీజ్ చేశారు. వీటి ద్వారా మూవీ ఏ రేంజులో ఉండబోతుంది? ఎంత భారీ ఎత్తున నిర్మించబోతున్నారనేది హింట్ ఇచ్చేశారు. కానీ ఇటు బన్నీ గానీ అటు అట్లీ గానీ రీసెంట్ టైంలో మీడియాకు దొరకలేదు. కాబట్టి వీడియోలతో అభిమానులు సరిపెట్టుకున్నారు. కానీ తాజాగా సత్యభామ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్న అట్లీ.. అల్లు అర్జున్‌తో చేయబోయే చిత్రం గురించి అదిరిపోయే విషయాలు బయటపెట్టాడు.

భారీ బడ్జెట్ మరియు టెక్నాలజీ

‘దేశంలోనే ఇదే ఖరీదైన సినిమా. చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. సరికొత్త టెక్నాలజీ కూడా పరిచయం చేయబోతున్నాం. బడ్జెట్ ఎంతనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సినిమా తీయడం వరకే నా బాధ్యత. విడుదల ఎప్పుడనేది నిర్మాత తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది’ అని అట్లీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అట్లీ చెప్పిన దాని బట్టి చూస్తుంటే హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకు కాస్ట్ లీ మూవీస్ అంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల గురించి మాట్లాడుకునేవాళ్లు. త్వరలో అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారేమో. ఇందులో బన్నీ.. మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. అందుకు తగ్గట్లే దీపికా పదుకొణెని ఇదివరకే హీరోయిన్‌గా ప్రకటించారు. వీళ్లతో పాటు మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్ కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయిందని టాక్. ప్రస్తుతానికైతే అట్లీ చెప్పినవే అప్డేట్స్. మిగిలినవి త్వరలో బయటపెడతారేమో?

నటీనటులు మరియు ప్రీ ప్రొడక్షన్

అట్లీ-అల్లు అర్జున్ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది. బడ్జెట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, సినిమా అంచనాలను అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.