|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తలైవర్ 173కి అట్లీ శిష్యుడు డైరెక్టర్: కమల్ నిర్మాణంలో రజినీకాంత్ చిత్రాన్ని తెరకెక్కించేది ఇతడే!

Published: 03-01-2026, 3:00 AM
తలైవర్ 173కి అట్లీ శిష్యుడు డైరెక్టర్: కమల్ నిర్మాణంలో రజినీకాంత్ చిత్రాన్ని తెరకెక్కించేది ఇతడే!
  • తలైవర్ 173కి దర్శకుడిగా సిబి చక్రవర్తి ఖరారు.
  • కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ నటిస్తున్న మొదటి చిత్రం.
  • సిబి చక్రవర్తి అట్లీ శిష్యుడు, ‘డాన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం.
  • అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, 2027 సంక్రాంతికి విడుదల ప్లాన్.

తలైవర్ రజినీకాంత్ 173వ సినిమాపై ఉత్కంఠకు తెరపడింది. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి అట్లీ శిష్యుడు సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. ‘డాన్’ చిత్రంతో మెప్పించిన సిబి, రజినీకాంత్‌తో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. 2027 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

తలైవర్ 173: సుందర్ సి నిష్క్రమణ, కొత్త దర్శకుడు

తమిళ చిత్రసీమతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న స్టార్ నటులు రజినీకాంత్, కమల్ హాసన్. ఈ  ఇద్దరూ పెద్ద స్టార్లు గతంలో పలుమార్లు కలిసి నటించారు. కానీ  మొదటిసారి కమల్ నిర్మాణంలో రజినీకాంత్ నటిస్తున్నారని గత నవంబర్‌లో ప్రకటించారు. ఈ 173వ సినిమాకి సుందర్ సి ని దర్శకుడిగా కూడా అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.

తలైవర్ 173 సినిమా ప్రకటన వచ్చిన వారంలోనే సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. కథ నచ్చకపోవడమే దానికి కారణమన్న టాక్ వినిపించింది. ఆయన తప్పుకున్నప్పటి నుంచి వాత దర్శకుడిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇక తాజాగా ఈసినిమా దర్శకుడెవరో చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

అట్లీ శిష్యుడు సిబి చక్రవర్తి నేపథ్యం

తలైవర్ 173కి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. ఈ యంగ్ డైరెక్టర్ గతంతో శివకార్తికేయన్ ‘డాన్’ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, 2027 సంక్రాంతి కానుకగా ఈమూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

రజినీకాంత్ కొత్త చిత్రం: విడుదల తేదీ, టీమ్

సిబి చక్రవర్తి దర్శకుడు అట్లీ శిష్యుడు. ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ లాంటి సినిమాలకు అతను అసిస్టెంట్ డైరెక్టర్ గా అట్లీ దగ్గర ా పనిచేశారు. 2022లో శివకార్తికేయన్ ‘డాన్’తో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే 125 కోట్లు వసూలు చేయగలిగే సినిమాను అందించాడు. మరి రజినీకాంత్ తో సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో చేస్తాడో చూడాలి.

సుందర్ సి నిష్క్రమణ తర్వాత తలైవర్ 173 దర్శకుడిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అట్లీ శిష్యుడు సిబి చక్రవర్తి దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.