|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి: రేవంత్ రెడ్డి ఆదేశాలతోనేనా? హరీష్ రావు సంచలన ఆరోపణలు!

Published: 04-04-2026, 6:35 AM
కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి: రేవంత్ రెడ్డి ఆదేశాలతోనేనా? హరీష్ రావు సంచలన ఆరోపణలు!
  • గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.
  • సీఎం రేవంత్ రెడ్డి ఫొటో లేకపోవడంతో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఫొటో తగిలించిన కార్యకర్తలు.
  • దాడిని ఖండించిన హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జరిగిందని ఆరోపణ.
  • కాంగ్రెస్ పాలనలో దాడులు నిత్యకృత్యమయ్యాయని హరీష్ రావు విమర్శించారు.

గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆఫీస్‌పై దాడి జరగడంతో ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ దాడి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారమే జరిగిందని హరీష్ రావు ఆరోపించారు.

కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి: గజ్వేల్‌లో ఉద్రిక్తత

గజ్వేల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో లేకపోవటంపై నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కార్యాలయం గోడకు రేవంత్ ఫొటోను తగిలించారు.

ఈ క్రమంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… క్యాంప్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఈ దాడి జరిగందని ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే దాడి: హరీష్ రావు ఆరోపణ

“పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోంది. ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా..? కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియా పై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు..?” అని హరీశ్ రావ్ ప్రశ్నించారు.

“ఒకవైపు “హేట్ స్పీచ్ బిల్” పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ… మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన? ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ… గూండా రాజ్యం అమలు చేస్తారా? సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ… పాలనను గాలికి వదిలేసారా? ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే… ఇక్కడ పాలనను ఎవరు చూస్తారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా..?”అని హరీశ్ రావ్ నిలదీశారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ క్యాంప్ కార్యాలయం దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బాధ్యులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

బీఆర్ఎస్ నేతల ఆగ్రహం: కాంగ్రెస్ గూండాయిజంపై విమర్శలు

మీ దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదని హరీశ్ రావ్ స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామన్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని… ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై జరిగిన దాడి రాజకీయ దుమారం రేపుతోంది. హరీష్ రావు ఆరోపణలు, బీఆర్ఎస్ నేతల ఆగ్రహంతో పరిస్థితి మరింత వేడెక్కింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.