|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఫరూఖ్ అబ్దుల్లాపై కాల్పులు! తృటిలో తప్పిన ప్రమాదం! అసలేం జరిగింది?

Published: 11-03-2026, 5:05 PM
  • జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు
  • ఫరూఖ్ అబ్దుల్లాకు పెను ప్రమాదం తప్పింది, సురీందర్ చౌదరికి స్వల్ప గాయాలు
  • జడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ దాడి జరగడంపై సీఎం ఒమర్ ఆగ్రహం
  • దాడి చేసిన వ్యక్తి మైనింగ్ వ్యాపారి కమల్ సింగ్ అని నిర్ధారణ

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. పెళ్లి వేడుకకు వెళ్లిన ఆయనపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఫరూఖ్ అబ్దుల్లా సురక్షితంగా బయటపడ్డారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫరూఖ్ అబ్దుల్లాపై కాల్పులు – వివరాలు

దేశంలో రోజుకో దారుణ సంఘటన జరుగుతోంది. తాజాగా ఓ మాజీ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ( Farooq Abdullah )పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో ( Deputy CM Surinder choudhary) కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది. అయినప్పటికీ ఓ దుండగుడు, డిప్యూటీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై కాల్పులు జరిపాడు.

అయితే అదృష్టవశాత్తు ఫరూఖ్ అబ్దుల్లాకు ఎలాంటి బుల్లెట్ తగలలేదు. దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రత సిబ్బంది, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసింది మైనింగ్ వ్యాపారి కమల్ సింగ్ అని ప్రాథ‌మిక నిర్దార‌ణ‌కు వ‌చ్చారు పోలీస్ అధికారులు. అటు ఫరూఖ్ అబ్దుల్లా కు ఎలాంటి గాయాలు కూడా జరగలేదని సమాచారం. కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి సురీందర్ కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక దీనిపై సీఎం ఒమర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. Z ప్లస్ కేటగిరి భద్రతను దాటుకొని నిందితుడు ఎలా దూసుకు వచ్చాడని సీఎం ఒమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ద‌య‌వ‌ల్ల ఫరూఖ్ అబ్దుల్లా బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని వెల్ల‌డించారు. ఇది ఇలా ఉండ‌గా, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా హత్యాయత్నం చేసిన వ్య‌క్తి వీడియో వైర‌ల్ గా మారింది. దాని ఆధారంగా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

భద్రతా వైఫల్యంపై సీఎం ఒమర్ ఆగ్రహం

ఫరూఖ్ అబ్దుల్లాపై జరిగిన ఈ దాడి తీవ్ర కలకలం రేపుతోంది. దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.