
📌 Key Points
- చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ఫిబ్రవరి 6న విడుదల!
- ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బూతు పాట పాడిన చంద్రహాస్!
- మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తోంది.
- నెటిజన్ల ఆగ్రహం: హీరోగా ఉండి ఇలాంటి పనులు చేయొద్దని కామెంట్స్!
ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా వేడుకలో చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకుందాం రండి!
చంద్రహాస్ ప్రీ రిలీజ్ హంగామా
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన చంద్రహాస్(Chandrahas), సినిమాలు చేయడం కంటే తన వింత ప్రవర్తన వల్లే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటారు. తాజాగా.. మరోసారి వార్తల్లో నిలిచి ట్రోల్స్‌కు గురవుతున్నాడు. ఆయన నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. ఈ మూవీప్రీ రిలీజ్ వేడుకలో.. చంద్రహాస్ అతి ఉత్సాహం ప్రదర్శించి విమర్శల పాలయ్యాడు. అందరూ చూస్తుండగానే స్టేజీపై ఒక బూతు పాటను పాడటంతో అక్కడ ఉన్న వారితో పాటు నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. ఒక హీరోగా ఉండి ఇలాంటి పాటలు పాడటం ఏంటని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మంచి సినిమాలు చేయాలని అనుకుంటూ, మరోపక్క ఇలాంటి బూతు పాటలు పాడి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
నెటిజన్ల ఆగ్రహం.. ట్రోల్స్ స్టార్ట్!
కొందరు ఆయన పాడే స్టైల్‌ను చూసి వెటకారంగా ‘అర్జిత్ సింగ్’ అని పిలుస్తుంటే, మరికొందరు మాత్రం ఇలాంటి వాళ్లను ఇండస్ట్రీకి రాకుండా చూడాలని మండిపడుతున్నారు. గతంలో కూడా చంద్రహాస్ చేసిన కొన్ని పనులు, మాట్లాడిన మాటలు పెద్ద వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన తండ్రి ప్రభాకర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు కానీ, ఈసారి నేరుగా స్టేజీపైనే ఇలా ప్రవర్తించడంతో ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బూతు పాట గొడవ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కేవలం నెగిటివ్ పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారా? లేక నిజంగానే ఆయనకు అంత యాటిట్యూడ్ ఉందా? అని చర్చలు నడుస్తున్నాయి.
‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ అప్‌డేట్స్
కాగా.. ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంపత్ రుద్ర దర్శకత్వం వహించారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్స్‌పై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఇందులో అర్జున్ మహి విలన్‌గా నటిస్తుండగా.. లక్ష్మన్ మీసాల, మధునందన్, మురళీధర్ గౌడ్, మధునందన్, అభయం నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడమ్, సునీత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న విడుదల అవ్వబోతుంది.
చంద్రహాస్ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


