|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తలస్నానం: ఏ రోజు చేయాలి? ఏ రోజు చేయకూడదు? శాస్త్రం ఏం చెబుతోంది?

Published: 15-01-2026, 10:00 PM
తలస్నానం: ఏ రోజు చేయాలి? ఏ రోజు చేయకూడదు? శాస్త్రం ఏం చెబుతోంది?
  • సోమవారం తలస్నానం చేస్తే మనస్సు ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటుంది.
  • మంగళవారం తలస్నానం చేస్తే ఆపదలు, గొడవలు వచ్చే అవకాశం ఉంది.
  • గురువారం తలస్నానం చేయడం వలన చదువులో నష్టం, ఆర్థిక సమస్యలు రావచ్చు.
  • శనివారం తలస్నానం చేస్తే పురుషులు, స్త్రీలు ఇద్దరికీ శుభం కలుగుతుంది.

హిందూ సంప్రదాయంలో తలస్నానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం శుభ్రత కోసమే కాదు, ఆరోగ్యం, అదృష్టం, మనస్సుపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఏ రోజు తలస్నానం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

తలస్నానం యొక్క ప్రాముఖ్యత

హిందూ సంప్రదాయం ప్రకారం తలస్నానం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మాత్రమే తలస్నానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే తలస్నానం కేవలం శుభ్రత కోసమే కాదు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆరోగ్యం, అదృష్టం, మనసుపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

చాలా మంది హిందూ సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం తలస్నానం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మాత్రమే తలస్నానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే తలస్నానం కేవలం శుభ్రత కోసమే కాదు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆరోగ్యం, అదృష్టం, మనసుపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

తలస్నానం చేయడానికి కొన్ని రోజులు శుభప్రదమైనవి, అలాగే కొన్ని రోజులు తలస్నానం చేయడానికి అశుభకరమైనవి. మరి ఏ రోజు తలస్నానం చేస్తే మంచిది? ఏ రోజు తలస్నానం చేయకూడదు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తలస్నానం ఏ రోజు చేయాలి? ఏ రోజు చేయకూడదు?

ఏ రోజు తలస్నానం చేస్తే శుభం?

ఏ రోజు తలంటు స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఏ రోజు తలంటు స్నానం చేయకూడదు?

సోమవారం నాడు తలంటు స్నానం చేయడానికి ఎంతో మంచి రోజు. మనసు ప్రశాంతంగా మారుతుంది, మనోధైర్యం కూడా పెరుగుతుంది.

మంగళవారం నాడు తలంటు స్నానం చేయకూడదు. అలా చేయడం వలన ఆపదలు, గొడవలు రావచ్చు. శుభఫలితాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. స్త్రీలు మంగళవారం తలంటు స్నానం చేయడం వలన వారి భర్తకు హాని కలుగుతుందని కూడా అంటారు.

బుధవారం నాడు స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది, లాభాలు ఉంటాయి.

ఏ రోజు తలస్నానం చేయకూడదు?

గురువారం నాడు చేయకూడదు. అలా చేయడం వలన మానసిక ఆందోళన కలుగుతుంది. చదువు పరంగా నష్టం కలగవచ్చు. ఆర్థిక సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు గురువారం నాడు స్నానం చేయకూడదని గుర్తుపెట్టుకోండి.

అలాగే శుక్రవారం నాడు తలంటు స్నానం చేయడం పురుషులకు అశుభంగా భావిస్తారు. మానసిక శాంతి కోల్పోతారు. వస్తువులను పోగొట్టుకోవడం లాంటివి కూడా జరగొచ్చు. అయితే స్త్రీలకు మాత్రం ఇది ఎంతో మంచిది. లక్ష్మీవారం కావడంతో స్త్రీలు తలంటు స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

శనివారం నాడు తలంటు స్నానం చేయడం పురుషులు, స్త్రీలు ఇద్దరికీ శుభాన్ని తీసుకొస్తుంది. కొత్త వస్తువులు కూడా లభించే అవకాశాలు ఉంటాయి.

ఈ నియమాలను అనుసరించి తలస్నానం చేయడం వలన మీకు సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండుగా ఉండాలని ఆశిస్తున్నాను. శుభం భూయాత్!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.