
📌 Key Points
- జబర్దస్త్ రాంప్రసాద్ దర్శకుడిగా కొత్త అవతారం!
- గెటప్ శీను ద్వారా రాంప్రసాద్ సినిమా ప్రకటన.
- త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న రాంప్రసాద్ మూవీ!
- దర్శకత్వంపైనే రాంప్రసాద్ పూర్తి ఫోకస్?
జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ డైరెక్టర్ కాబోతున్నాడనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన రాంప్రసాద్ ఇప్పుడు డైరెక్టర్‌గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.
డైరెక్టర్ అవతారమెత్తిన రాంప్రసాద్!
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటులకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ షో వల్ల మంచి గుర్తింపును సంపాదించుకున్న అనేకమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి స్థాయిలో కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంతో గుర్తింపును సంపాదించుకున్న వారిలో కొంతమంది దర్శకులు కూడా అయ్యారు. మొదటగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ను సంపాదించుకున్న వేణు ‘బలగం’ సినిమాతో దర్శకుడు అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈయనకు గుర్తింపు వచ్చింది.
గెటప్ శీను ద్వారా వెల్లడైన సీక్రెట్
ఈ కామెడీ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ధనరాజ్ కూడా రామం రాఘవం అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. కొన్ని రోజుల క్రితమే అదిరే అభి కూడా చిరంజీవ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ లిస్టులోకి మరో జబర్దస్త్ కమెడియన్ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు తన ఆటో పంచులతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రాంప్రసాద్. ఈ నటుడు జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను టీంలో అనేక స్కిట్లను వేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
రాంప్రసాద్ సినిమా పనులు ప్రారంభం!
అలాగే ఈ నటుడు కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఈయన మరికొన్ని రోజుల్లోనే దర్శకుడిగా సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తన స్నేహితుడు గెటప్ శీను తెలియజేశాడు. తాజాగా గెటప్ శీను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మరికొన్ని రోజుల్లోనే రాంప్రసాద్ దర్శకుడిగా ఓ సినిమాను ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని వెల్లడించాడు. ఈయన దర్శకుడిగా సినిమాను మొదలు పెట్టబోతున్నాడని గెటప్ శీను చెప్పడంతో ఇకపై ఇతను కామెడీ షోలలో పాల్గొంటాడా? లేక మొత్తం దర్శకత్వంపైనే ఫోకస్ పెడతాడా అనేది బుల్లితెర అభిమానుల్లో ఆసక్తిగా మారింది.
రాంప్రసాద్ డైరెక్షన్‌లోకి అడుగుపెట్టడం నిజంగా ఒక సంచలన వార్త. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. అప్పటివరకు వేచి ఉండండి! తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


