|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మత్తెక్కిస్తోన్న కళ్లతో కుర్రాళ్లను మాయ చేస్తోన్న కుర్ర నటి అవంతిక.. పోస్ట్ వైరల్

Published: 29-06-2025, 9:01 AM
మత్తెక్కిస్తోన్న కళ్లతో కుర్రాళ్లను మాయ చేస్తోన్న కుర్ర నటి అవంతిక.. పోస్ట్ వైరల్

చిన్న వయసులోనే నృత్యంలో రాణించిన అవంతిక, తెలుగు సినిమాలో బాలనటిగా అరంగేట్రం చేసింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో పరిచయమైన ఈ అమ్మాయి తన తాజా ఫోటోషూట్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

అవంతిక ఐదేళ్ల వయసులోనే నృత్యం ప్రారంభించింది.

2

డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ లో రెండో స్థానం సాధించింది.

4

తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అవంతిక: నృత్యం నుండి సినిమా వరకు

నటి అవంతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఐదవ ఏటనుండే నాట్యంతో తన కళా వృత్తిని మొదలు పెట్టింది. మొదటగా తను సెమీ క్లాసిక్ నృత్యంలో శిక్షణ పొందింది. ఈ అమ్మడు నాట్యకారిణి, గాయకురాలు, మోడల్ కూడా. కాలిఫోర్నియా చెందిన ఈ నటి జూన్ 2014 లో జరిగిన జీ టీవీ రియాలిటీ కార్యక్రమం డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ ఉత్తర అమెరికాలో తన ప్రదర్శనకి పేరు గాంచింది. ఆమె ఆ కార్యక్రమములో రెండవ విజేతగా నిలిచింది. ఐదేళ్ల వయసులో డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించిన అవంతిక.. కూచిపూడి, కథక్, జాజ్, ఇండియన్ కాంటెపరరీ డ్యాన్సులన్నీ నేర్చుకుంది. బొమ్మలు కూడా గీయడంలో దిట్ట.

బ్రహ్మోత్సవం తో తెలుగు సినిమా ప్రవేశం

2015 సంవత్సరంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. ఆమె 2016 లో విడుదలైన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వారి కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంలో చుట్కీ పాత్రకు ఎంపికైనది. కానీ షెడ్యూల్ కుదరకపోవడం వల్ల తను ఆ మూవీలో నటించలేదు. మహేష్ బాబు, కాజల్, సమంత, ప్రణీత నటించిన బ్రహ్మోత్సవం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి బాలనటిగా పరిచయమయ్యింది. అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

తదుపరి చంద్రశేఖర్ యేలేటి చిత్రం మనమంతాలో నటించింది. గోపి చంద్ చిత్రం ఆక్సిజన్ లో ఒక పాటలో చిన్న రోల్ చేసింది. తదుపరి నాగ చైతన్య, శ్రుతి హాసన్ సినిమా ప్రేమ్‌లో తృతీయ కథానాయకి (మడోన్నా సెబాస్టియన్) యుక్త వయసు పాత్రలో నటించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్లను మాయ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వగా నెటిజన్లు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. instagram link

అవంతిక తన నటనతో పాటు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులతో అనుబంధాన్ని ఏర్పరుచుకుంటోంది. ఈ వైరల్ ఫోటోలు ఆమెకు మరింత ప్రజాదరణను తెచ్చిపెట్టాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.