|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అవతార్ 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్ల ప్రభంజనం… బాక్సాఫీస్ వద్ద మాత్రం షాకింగ్ డీలా!

Published: 22-12-2025, 9:04 AM
అవతార్ 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్ల ప్రభంజనం... బాక్సాఫీస్ వద్ద మాత్రం షాకింగ్ డీలా!
  • `అవతార్ 3` రిలీజ్‌కి ముందే రూ.5000 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్‌ చేసింది.
  • ఓటీటీ, శాటిలైట్ హక్కులను డిస్నీ సొంతం చేసుకుంది (రూ.2900 కోట్లు & రూ.1500 కోట్లు).
  • సినిమా విడుదలైన తర్వాత నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డీలా పడింది.
  • బడ్జెట్ (రూ.3500 కోట్లు) రీత్యా సేఫ్‌గా ఉన్నా, కలెక్షన్లు అంచనాలకు తగ్గట్టు లేవు.

జేమ్స్ కామెరూన్ సృష్టించిన `అవతార్ 3` సినిమా విడుదలకు ముందే రూ.5000 కోట్లకు పైగా భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో వార్తల్లో నిలిచింది. కానీ, విడుదలైన తర్వాత నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక డీలా పడింది. దీని వెనుక కారణాలు, ప్రస్తుత కలెక్షన్ల వివరాలు పరిశీలిద్దాం.

రిలీజ్‌కి ముందే భారీ బిజినెస్‌

క్రిస్మస్‌ కానుకగా  విజువల్‌ వండర్‌ `అవతార్‌ 3` గ్రాండ్‌గా రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. జేమ్స్ కామెరూన్‌ రూపొందించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్‌ చేశారు. `అవతార్‌` సిరీస్‌లో భాగంగా వచ్చిన మూడో చిత్రమిది. మొదటి మూవీ పెద్ద హిట్‌ కావడం, రెండో చిత్రం కూడా బాగా మెప్పించడంతో భారీ అంచనాలున్నాయి. కానీ మూడో భాగం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యింది. అయితే ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. హాలీవుడ్‌ మీడియానే నెగటివ్‌ రివ్యూస్‌ ఇచ్చింది.

ఇండియాలోనూ `అవతార్‌ 3` భారీ స్థాయిలో విడుదలయ్యింది. మన భారతీయ ఆడియెన్స్ నుంచి కూడా నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. రెండో భాగాన్ని మళ్లీ రిలీజ్‌ చేసినట్టుగానే ఉందని, ఏమాత్రం కొత్తదనం లేదని అన్నారు. పైగా ఎక్కువగా సాగదీసినట్టుగా ఉంది, స్లోగా ఉంది. మన భారతీయ ఎమోషన్‌ మేళవించే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. దీంతో నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద డీలా పడింది.

అంచనాలు అందుకోవడంలో విఫలం: నెగటివ్ టాక్

ఈ మూవీ రిలీజ్‌కి ముందే భారీగా రాబట్టింది. ఏకంగా దాదాపు ఐదు వేల కోట్లని రాబట్టడం విశేషం. `అవతార్‌ 3` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూపంలోనే భారీగా వచ్చాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ దక్కించుకుంది. అందుకుగానూ ఏకంగా రూ.2900కోట్లు చెల్లించింది. అలాగే శాటిలైట్‌ రైట్స్ ని కూడా డిస్నీ ప్లస్‌ సొంతం చేసుకుంది. అందుకుగానూ రూ.1500కోట్లు రాబట్టింది. ఇక మ్యూజిక్‌ రైట్స్ రూ.350కోట్లు కావడం విశేషం. ఇలా మొత్తంగా ఈ చిత్రానికి రిలీజ్‌కి ముందే బిజినెస్‌ రూపంలో రూ.4750కోట్లు రావడం మరో విశేషం. ఈ సినిమా బడ్జెట్‌ రూ.3500కోట్లు వరకు అయ్యిందని అంచనా. ఈ లెక్కన ఈ సినిమా రిలీజ్‌కి ముందే సేఫ్‌లో ఉంది. ఇంకా లాభాల్లోనే ఉంది.

బాక్సాఫీస్ వద్ద డీలా: కలెక్షన్ల పరిస్థితి

కాకపోతే కలెక్షన్ల పరంగా భారీ అంచనాలున్నాయి. మొదటి రెండు సినిమాలు దాదాపు రూ.18000కోట్లు వసూలు చేశాయి. దీంతో బాక్సాఫీసు వసూళ్ల పరంగా పోటీ ఉంది. ఆ విషయంలో ఈ మూవీ వెనకబడిపోతుందని చెప్పొచ్చు. ఫైనల్‌ కలెక్షన్లు  పదివేల కోట్ల వరకు వెళ్తుందా అనే డౌట్‌ ఉంది. ఇప్పటికేతై ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.2700కోట్లు రాబట్టింది. ఇండియాలో సుమారు డెబ్బై కోట్లు వచ్చినట్టు అంచనా. బడ్జెట్‌ పరంగా సేఫ్‌లోనే ఉన్నా, గత చిత్రాలతో పోల్చితే మాత్రం డీలా పడిపోయిందని చెప్పొచ్చు.

మొత్తంమీద `అవతార్ 3` ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సంచలనం సృష్టించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సేఫ్‌ జోన్‌లో ఉన్నా, కలెక్షన్ల పరంగా మునుపటి భాగాల స్థాయిని అందుకోలేకపోయిందని స్పష్టమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.