|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండియాలో అవతార్‌ ఈవెంట్‌

Published: 25-10-2025, 6:46 PM
ఇండియాలో అవతార్‌ ఈవెంట్‌

జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇండియాలో ఓ పెద్ద ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు.

Key Points

1

‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

2

జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదల.

4

‘అవతార్ 3’తో పాటు ‘అవతార్ 4, 5’ చిత్రాలనూ జేమ్స్ కామెరూన్ ధృవీకరించారు.

కొత్త అవతార్ సినిమా విశేషాలు

‘అవతార్‌’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’(Avatar: Fire And Ash). సామ్‌ వర్తింగ్టన్, జో సాల్డానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్‌ లాంగ్, ఊనా చాప్లిన్, కేట్‌ విన్సె్లట్‌ ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంగా నటించగా, క్లిఫ్‌ కర్టిస్, డేవిడ్‌ థెవ్లిస్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జేమ్స్‌ కామెరూన్, జాన్‌ లాండౌ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు  కొన్ని భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగులో కూడా విడుదలవుతోంది.

ఇండియాలో భారీ ఈవెంట్ ప్లాన్

కాగా, ఈ ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’కు సంబంధించి ఇండియాలో ఓ పెద్ద ఈవెంట్‌ను  ప్లాన్‌ చేస్తారట మేకర్స్‌. మరోవైపు ఇండి యాలో ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ సినిమా ప్రదర్శితం కానున్న థియేటర్స్‌లో ‘అవతార్‌’ ఫ్రాంచైజీ సినిమా అభిమానులు కొందరు ‘అవతార్‌’ సినిమా లోగోను దీపాల రూపంలో వెలిగించి, హ్యాఫీ ఫీలయ్యారు.

అవతార్ సిరీస్: గత, భవిష్యత్తు

ఇక 2009లో వచ్చిన ‘అవతార్‌’, 2022లో వచ్చిన ‘అవతార్‌ 2 (అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌)  ప్రేక్షకులను మెప్పించి, రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘అవతార్‌ 3’ రానుంది. అలాగే ‘అవతార్‌ 4, అవతార్‌ 5’ చిత్రాలూ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయాన్ని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ కన్ఫార్మ్‌ చేసిన విషయం తెలిసిందే.

‘అవతార్’ సిరీస్ గత చిత్రాల భారీ విజయాలను కొనసాగించేలా ‘ఫైర్ అండ్ యాష్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇండియాలో ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ, ప్రత్యేక ఈవెంట్ ప్లానింగ్ సినిమాపై మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.