హాలీవుడ్ సెన్సేషన్ అవతార్ ఫ్యాన్స్‌కు పండగే! అవతార్ 3 ‘ఫైర్ అండ్ యాష్’ విడుదలకు ముందు, అవతార్ 2 ‘ది వే ఆఫ్ వాటర్’ సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఈ రీ-రిలీజ్‌లో పార్ట్ 3 నుండి ప్రత్యేక దృశ్యాలు, జేమ్స్ కామెరాన్ సందేశం హైలైట్. డిసెంబర్ 19న పార్ట్ 3 థియేటర్లలోకి రానుంది.
Key Points
అవతార్ 2 – ది వే ఆఫ్ వాటర్ సినిమాను తిరిగి థియేటర్లలో విడుదల చేశారు.
ఈ రీ రిలీజ్ లో అవతార్ 3 ‘ఫైర్ అండ్ యాష్’ నుండి కొన్ని ప్రత్యేక సీన్స్ ప్రదర్శిస్తున్నారు.
జేమ్స్ కామెరాన్ నుండి ఒక స్పెషల్ మెసేజ్, పార్ట్ 3 కి సంబంధించిన బిహైండ్-ది-సీన్స్ కూడా చూడవచ్చు.
అవతార్ 3 – ‘ఫైర్ అండ్ యాష్’ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అవతార్ 2 రీ-రిలీజ్‌లో కొత్తగా ఏం ఉంది?
Avatar : హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అవతార్ కి సీక్వెల్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో పార్ట్ అవతార్: ఫైర్ అండ్ యాష్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. అయితే ఆ సినిమా రిలీజ్ కి ముందు మరోసారి అవతార్ పార్ట్ 2 – ది వే ఆఫ్ వాటర్ ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు కంటిన్యుటీగానే పార్ట్ 3 ఉండనుంది.(Avatar)
అయితే అవతార్ ది వే ఆఫ్ వాటర్ రీ రిలీజ్ లో అవతార్ మూడవ పార్ట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ చూపిస్తారంట. అలాగే జేమ్స్ కామెరాన్ ఓ స్పెషల్ మెసేజ్ ఈ రీ రిలీజ్ తో ఇవ్వనున్నాడట. అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా నిన్న అక్టోబర్ 2 నుంచి రీ రిలీజ్ అయింది. ఇండియాలో కూడా పలు చోట్ల ఈ సినిమా రీ రిలీజ్ అయింది.
అవతార్ 3 ‘ఫైర్ అండ్ యాష్’ ప్రత్యేక దృశ్యాలు
Also See : Kiran Abbavaram : ఫ్రెండ్ పెళ్ళిలో భార్య, కొడుకుతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం.. క్యూట్ ఫొటోలు వైరల్..
అలాగే డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ మెసేజ్ తో పాటు అవతార్ పార్ట్ 3 కి సంబంధించి కొన్ని బిహైండ్-ది-సీన్స్ ని కూడా అవతార్ ది వే ఆఫ్ వాటర్ రీ రిలీజ్ తో చూపించనున్నారట. దీంతో అవతార్ ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్ కి కూడా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక పార్ట్ 3 అవతార్ – ఫైర్ అండ్ యాష్ ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ దాకా ఆగాల్సిందే.
జేమ్స్ కామెరాన్ సందేశం, ఫ్యాన్స్ అంచనాలు
Also See : Rahul Sipligunj : ఫ్యామిలీతో రాహుల్ సిప్లిగంజ్ దసరా వేడుకలు.. ఫొటోలు..
అవతార్ 2 రీ-రిలీజ్ ద్వారా అవతార్ 3 పై అంచనాలను మరింత పెంచిన జేమ్స్ కామెరాన్, డిసెంబర్ వరకు వేచి చూడలేని ఆసక్తిని రేపాడు. ఈ ప్రత్యేక దృశ్యాలు, సందేశం అభిమానులకు మంచి అనుభూతిని ఇస్తున్నాయి.


