
📌 Key Points
- షూటింగ్ సెట్‌లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అయేషా ఖాన్ సంచలన ఆరోపణలు!
- ఆన్‌లైన్‌లో రేప్ బెదిరింపులు, అసభ్యకర సందేశాలతో అయేషా ఆవేదన వ్యక్తం
- దురంధర్ సాంగ్ షూటింగ్‌లో పీరియడ్స్‌లో డ్యాన్స్ చేసినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్న అయేషా
- తక్షణమే స్పందించిన మూవీ టీమ్, వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటన
బాలీవుడ్ నటి అయేషా ఖాన్ సంచలన విషయాలు వెల్లడించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. షూటింగ్ సెట్‌లో తనపై జరిగిన రేప్ అటెంప్ట్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
షూటింగ్ సెట్‌లో రేప్ అటెంప్ట్.. అయేషా సంచలన ఆరోపణలు!
Ayesha Khan : బాలీవుడ్ లో టీవీ షోలతో, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అయేషా ఖాన్ ఇప్పుడు నటిగా బిజీగా ఉంది. తెలుగులో ముఖ చిత్రం, ఓం భీం బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది అయేషా. హిందీలో కూడా ధురంధర్, జాట్.. పలు సినిమాల్లో నటించింది.
తాజాగా అయేషా ఖాన్ ఓ సమ్మిట్ కి వెళ్లగా అక్కడ తన జీవితంలో ఫేస్ చేస్తున్న కొన్ని సంఘటనలను తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆన్‌లైన్ వేధింపులు, రేప్ బెదిరింపులతో అయేషా ఆవేదన!
అయేషా ఖాన్ మాట్లాడుతూ.. రేప్ చేస్తామంటూ ఆన్లైన్ లో కూడా బెదిరిస్తారు. నా నిజ జీవితంలో నాపై రేప్ అటెంప్ట్ చేసారు. దీని గురించి నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను. దాని గురించి మళ్ళీ ఆలోచించాలనుకోవట్లేదు. కొన్ని భయంకరమైన రోజులను నేను గుర్తుచేసుకోవాలని అనుకోవట్లేదు. నేను ఇంత ఫేమస్ కాకుంటే అలాంటి సంఘటన జరిగి ఉండేవేమో. ఒకరోజు షూటింగ్ సెట్ లో ఉండగా నా ఇన్‌స్టాగ్రామ్ కి రెగ్యులర్ గా అసభ్యకరంగా మెసేజ్ లు చేసే అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది. కొన్ని వాయిస్ క్లిప్స్ పెట్టారు. ఆ వాయిస్ తో షూటింగ్ సెట్ లో ఉన్నవాళ్లే అది చేసారని తెలిసి అక్కడే ఉన్న మా నాన్నకు, మూవీ టీమ్ కి ఇంఫార్మ్ చేశాను. వాళ్ళు చర్యలు తీసుకున్నారు. కానీ ఆ వేధింపులు భయంకరంగా ఉంటాయి.
పీరియడ్స్‌లో డ్యాన్స్ చేసినందుకు ట్రోల్స్.. అయేషా ఫైర్!
నేను పీరియడ్స్ లో ఉన్నప్పుడు ధురంధర్ లో సాంగ్ కి డ్యాన్స్ చేశాను అని చెప్పాను అందుకు కూడా ట్రోల్ చేసారు. ఆన్లైన్ లో రోజూ అసభ్యకరమైన పదాలతో కామెంట్స్ చేస్తారు. రేప్ చేస్తామంటూ మెసేజ్ లు చేసి బెదిరిస్తారు. నేను ఇప్పుడే నా ఫోన్ తీసి చూపించగలను అలాంటివి చాలా మెసేజ్ లు ఉంటాయి. నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా, నేను ఎలాంటి పోస్టులు పెట్టినా కొంతమందికి సమస్యే. నేను ఏదైనా బట్టలు వేసుకునేటప్పుడు, ఏవైనా పోస్టులు పెట్టేటప్పుడు వీటిని సెక్సువల్ గా చూస్తారేమో అని ఆలోచించాలా. ఇది చాలా బాధాకరమైన విషయం. చుట్టూ ఉండే కొంతమంది మనుషులను చూస్తే భయం వేస్తుంది అంటూ ఎమోషనల్ అయింది.
అయేషా ఖాన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మరిన్నిupdates కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.


