
భారత సినిమా చరిత్రలో ఒక ప్రభంజనం సృష్టించిన బాహుబలి సినిమా, ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ-రిలీజ్ అయి మళ్ళీ సంచలనం రేపుతోంది. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
Key Points
'బాహుబలి ది ఎపిక్' రీ-రిలీజ్‌గా వచ్చి రికార్డులు సృష్టిస్తోంది.
రాజమౌళి పర్యవేక్షణలో 3 గంటల 45 నిమిషాల నిడివితో రీ-ఎడిట్ చేశారు.
వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల భారీ వసూళ్లు సాధించింది.
అత్యధిక వసూళ్లు సాధించిన రీ-రిలీజ్ చిత్రంగా నిలిచింది.
‘బాహుబలి ది ఎపిక్’ రీ-రిలీజ్ సంచలనం
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి అంతటి ప్రభావాన్ని చూపిన మరో సినిమా లేదు. సౌత్ సినిమాకు పాన్-ఇండియా మార్కెట్ డోర్స్ ను తెరిచింది ఈ మూవీ. సినిమా అంటే మాదే అని విర్రవీగుతున్న బాలీవుడ్, అక్కడి మేకర్స్ అతి విశ్వాసానికి గట్టి దెబ్బ కొట్టింది. ఇక రిలీజ్ అయ్యి పదేళ్లవుతున్నా.. రీ-రిలీజై రికార్డులు సృష్టిస్తోంది.
బాహుబలి రెండు భాగాలను కలిపి, రాజమౌళి పర్యవేక్షణలో రీ-ఎడిట్ చేసి ‘బాహుబలి: ది ఎపిక్’గా రిలీజ్ చేశారు. నిడివి 3 గంటల 45 నిమిషాలు ఉన్నా, పాజిటివ్ రివ్యూలతో సినిమాకు మంచి ఆదరణ లభించింది. వరుసగా రెండు మూడు రోజులు థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో 29.65 కోట్లు, విదేశాల్లో 11.75 కోట్లు వసూలు చేసింది బాహుబలి రీరిలీజ్ వెర్షన్ మూవీ. ప్రపంచవ్యాప్తంగా వారం రోజులకు గాను బాహుబలి ది ఎపిక్ మూవీ 45 కోట్లతో.. అత్యధిక వసూళ్లు సాధించిన రీ రిలీజ్ సినిమాగా నిలిచింది.
రీ-రిలీజ్ రికార్డులు బద్దలు
ఇండియాలో రీ రిలీజ్ సినిమాల్లో ‘సనమ్ తేరీ కసమ్’ .39 కోట్లు, ‘తుంబాడ్’ 37.5 కోట్లతో ముందు ఉండగా.. ఈ సినిమాల రికార్డులను ఈ వారాంతంలో బాహుబలి బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికీ బాహుబలి ది ఎపిక్ మూవీ థియేటర్లలో బాగా రన్ అవుతోంది.
మొత్తంగా, ‘బాహుబలి ది ఎపిక్’ రీ-రిలీజ్ విజయవంతంగా దూసుకుపోతూ, బాహుబలి సినిమాకు ఉన్న శాశ్వత ఆదరణను మరోసారి నిరూపించింది. ఇది రీ-రిలీజ్ సినిమాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది అనడంలో సందేహం లేదు.


