|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Babil Khan: నోటికొచ్చింది అనేశాడు.. వీడియో డిలీట్ చేశాడు

Published: 04-05-2025, 7:45 AM
Babil Khan: నోటికొచ్చింది అనేశాడు.. వీడియో డిలీట్ చేశాడు

హిందీ సినిమా నటుడు బాబిల్ ఖాన్ తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, బాలీవుడ్‌లోని నెపోటిజం, మర్యాదలేమి గురించి తన బాధను వెల్లడించాడు. కానీ కొద్దిసేపటికే ఆ వీడియోను డిలీట్ చేయడం విశేషం.

Key Points

1

బాబిల్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ నెపోటిజంపై తన బాధను వ్యక్తం చేశాడు.

2

వీడియోలో బాలీవుడ్‌లోని నకిలీతనాన్ని, మర్యాదలేనితనాన్ని వివరించాడు.

4

ఈ ఘటన పబ్లిసిటీ స్టంట్ అవుతుందా లేక నిజమైన బాధా వ్యక్తీకరణ అవుతుందా అనేది తెలియాలి.

బాబిల్ ఖాన్‌ యొక్క భావోద్వేగ వీడియో

సినిమా ఇండస్ట్రీ అంటేనే నెపోటిజం, ఒకరిని ఒకరు తొక్కేయడాలు లాంటివి చాలా ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. కాకపోతే వీటి గురించి పెద్దగా బయటకు రాదు, రానివ్వరు. అప్పుడప్పుడు కొందరు నటీనటులు మాత్రం తమ బాధని వెళ్లగక్కుతుంటారు. అవి వీడియోల రూపంలో వైరల్ అవుతుంటాయి.

తాజాగా హిందీ సినిమాలు చేస్తున్న ఓ యంగ్ హీరో బాబిల్ ఖాన్.. ఏడుస్తూ బాధపడుతూ ఓ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేశాడు. బాలీవుడ్ లో అస్సలు మర్యాద ఇవ్వరు అని నోటికొచ్చింది మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటికే వీడియోని డిలీడ్ చేయడంతో పాటు అకౌంట్ ని డీయాక్టివేట్ చేసేశాడు.

బాలీవుడ్‌లోని నెపోటిజంపై ఆరోపణలు

‘ఈ రోజు మీ అందరితో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇండస్ట్రీలో(బాలీవుడ్) అర్జున్, అనన్య, షనయాతో పాటు సంబంధం లేని అర్జిత్ సింగ్ లాంటివాళ్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ అస్సలు మర్యాద ఇవ్వడం లేదు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే అత్యంత నకిలీ ఇండస్ట్రీ. ఇది బాగుండాలని కోరుకునేది కొందరే. నేను మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను’ అని బాబిల్ ఏడుస్తూ సదరు వీడియోలో చెప్పుకొచ్చాడు.

గతంలో లంచ్ బాక్స్, పీకూ, పాన్ సింగ్ తోమార్ తదితర సినిమాలతో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ కొడుకే ఈ బాబిల్ ఖాన్. 2020లో తండ్రి చనిపోయిన తర్వాత నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. పలు సినిమాల్లో సహాయ నటుడిగా చేశాడు. మొన్నీమధ్యే లాగౌట్ అనే ఓటీటీ మూవీలో హీరోగానూ చేశాడు.

వీడియో డిలీట్, అకౌంట్ డీయాక్టివేషన్

ఇప్పుడు చేసిన ఈ వీడియో పీఆర్ స్టంట్ లేదంటే నిజంగా బాధతో చెప్పాడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అర్జున్, అనన్య, షనయా నెపోటిజం అని అన్నాడు. అదే టైంలో తన తండ్రి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని బాబిల్ మర్చిపోయినట్లున్నాడు. మరి దీని వెనుక ఏం మతలబు ఉందో?

బాబిల్ ఖాన్ వీడియో వెనుక ఉన్న నిజం ఏమిటో ఇంకా తెలియాలి. ఇది నిజమైన బాధా వ్యక్తీకరణనా లేక పబ్లిసిటీ స్టంట్‌నా అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.