|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాబు మోహన్‌కు షాక్: ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం! ఘాట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!!

Published: 18-01-2026, 8:00 AM
బాబు మోహన్‌కు షాక్: ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం! ఘాట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!!
  • సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాబు మోహన్‌ను ఎన్టీఆర్ ఘాట్ వద్ద అడ్డుకున్నారు.
  • గతంలో ఎన్టీఆర్ గురించి బాబు మోహన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కారణం.
  • ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చిన బాబు మోహన్.
  • ఘాట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కాసేపు గందరగోళం.

సీనియర్ కమెడియన్ బాబు మోహన్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లగా అక్కడ ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని అడ్డుకున్నారు. గతంలో ఎన్టీఆర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఈ ఘటన కాసేపు ఉద్రిక్తంగా మారింది.

బాబు మోహన్‌ను అడ్డుకున్న ఎన్టీఆర్ అభిమానులు

Babu Mohan: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ కమెడియన్ గా ఎంతో మంచి కొత్త సంపాదించుకున్న బాబు మోహన్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈయన గత కొంతకాలంగా అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు కానీ రాజకీయాల పరంగా యాక్టివ్ ఉంటూ పలు రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు. అయితే నేడు బాబు మోహన్ విషయంలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. అసలు సీనియర్ ఎన్టీఆర్ (sr.NTR)అభిమానులు బాబు మోహన్ (Babu Mohan)తో గొడవ పడడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..

సీనియర్ నటుడు బాబు మోహన్ నేడు మరో దివంగత నటుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్(Sr.NTR Ghat) వద్దకు చేరుకున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం బాబు మోహన్ లోపలికి వెళ్లకుండా గేట్లు వేస్తూ ఆయనని అడ్డుకోవడమే కాకుండా లోపలికి వెళ్లడానికి వీలు లేదంటూ తనతో వాగ్వాదానికి దిగారు .ఈ నేపథ్యంలోనే అక్కడ కాస్త గందరగోల వాతావరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇలా ఎన్టీఆర్ ఘాట్ వద్ద చోటు చేసుకున్న ఈ పరిస్థితులు కాసేపటికి సద్దుమనగడంతో బాబు మోహన్ యధావిధిగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ అభిమానులు బాబు మోహన్ ను అడ్డుకోవడానికి కారణం లేకపోలేదు. గతంలో ఈయన తారక రామారావు గారి గురించి చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే తనని అడ్డుకున్నారని తెలుస్తోంది. ఇక నేడు ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఘాట్ వద్దకు చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక నేడు ఉదయమే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులు అర్పించిన విషయం తెలిసిందే.

వాగ్వాదానికి దారితీసిన వివాదాస్పద వ్యాఖ్యలు

ఎన్టీఆర్ ఘాట్ దగ్గర బాబు మోహన్ మీద విరుచుకుపడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్ …దళితుడు అంటే ఇంత చిన్న చూపా?? @ncbn pic.twitter.com/ZXZYfZNhyz

— Hungry కుక్క 🐕 (@Truth_Exposer__) January 18, 2026

ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

ఇలా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు రాజకీయ నాయకులకు కూడా ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. ఇక బాబు మోహన్ విషయానికి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ కమెడియన్ గా మంచి సక్సెస్ అందుకున్న ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వయసు పైబడిన నేపథ్యంలోనే ఈయన సినిమాలను తగ్గించారని చెప్పాలి. ఇలా సినిమాలకు దూరమైన బాబు మోహన్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. గతంలో బిజెపి , టిఆర్ఎస్ పార్టీలకు మద్దతు తెలిపిన బాబు మోహన్ ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే.

మొత్తానికి ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం, ఘాట్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ బాబు మోహన్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించి వెళ్లిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.