
బ్లాక్ బస్టర్ హిట్ “బేబి” సినిమా నిర్మాత ఎస్కేఎన్ తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ప్రస్తుత ప్రాజెక్టులు, మరియు తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేయడం గురించి వివరించారు.
Key Points
బేబి నిర్మాత ఎస్కేఎన్ తన సినీ ప్రయాణం గురించి వివరించారు.
ఎనిమిది మంది తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేశారు, మరో ముగ్గురిని పరిచయం చేయనున్నారు.
చెన్నై లవ్ స్టోరీ, హిందీ బేబి సినిమాతో పాటు మరిన్ని కొత్త ప్రాజెక్టులు ప్రకటించారు.
మారుతి, సాయి రాజేశ్ తో కలిసి కొత్త సినిమాలు నిర్మించనున్నారు.
ఎస్కేఎన్ సినీ ప్రయాణం
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో “బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సక్సెస్‌ఫుల్ యంగ్ నిర్మాత ఎస్‌కేఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ”, హిందీలో “బేబి” సినిమాతో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి.
ఇవాళ (జూలై 7) నిర్మాత ఎస్కేఎన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నిర్మాత ఎస్‌కేఎన్ ప్రొడ్యూసర్‌గా తన కెరీర్ విశేషాలను, ప్రస్తుతం చేస్తున్న మూవీస్ ప్రోగ్రెస్‌ను ఇంటర్వ్యూలో తెలిపారు.
-నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. చిన్నప్పటి నుంచి వ్యాస రచన పోటీలు, డిబేట్స్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించాను. అలా సినిమా స్క్రిప్ట్స్ రాయాలనే ఆలోచనలు కూడా ఉండేవి.
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు
-తర్వాత పీఆర్ఓగా కెరీర్ స్టార్ట్ చేశా. కొన్నాళ్లకు మారుతి .. ఇలా పీఆర్ఓగా ఉండిపోతావా అని అంటూ నేను డైరెక్షన్ చేస్తా, మీరు ప్రొడ్యూస్ చేయండని ప్రోత్సహించాడు. మారుతి డైరెక్షన్‌లో నేను, శ్రేయాస్ శ్రీను కలిసి ఈ రోజుల్లో మూవీ నిర్మించాం. ఆ సినిమా సక్సెస్‌తో ప్రొడ్యూసర్‌గా నా జర్నీ మొదలైంది.
-తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏడెనిమిది మందిని పరిచయం చేశాం. మరో ఇద్దరు ముగ్గురిని త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. హీరోయిన్స్‌గానే కాదు వివిధ విభాగాల్లోనూ అవకాశాలు ఇస్తున్నాం. లేడీ డైరెక్టర్స్‌ను కూడా పరిచయం చేస్తాం.
-హిందీ బేబి మూవీ నెక్ట్స్ మంత్ షూటింగ్ ప్రారంభిస్తాం. చెన్నై లవ్ స్టోరీ సెట్స్ మీద ఉంది. కృష్ణ అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ మూవీ పూజా ఈ నెలాఖరులో చేస్తాం. ఈ చిత్రంలో ఒక ఫేమ్ ఉన్న హీరోయిన్‌తో పాటు ఇద్దరు యంగ్ హీరోలు ఉంటారు.
వచ్చే ప్రాజెక్టుల వివరాలు
– హరి హర వీరమల్లు మూవీకి వర్క్ చేసిన అవినాష్‌ను డైరెక్టర్‌గా పెట్టి కన్నడలోని ఓ స్టార్ హీరో, మన తెలుగు నుంచి మిడ్ రేంజ్ హీరో కలిపి ఓ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఈ రెండు మూవీస్ వెంటనే ప్రారంభిస్తున్నాం.
-అలాగే ప్రభాస్ రాజా సాబ్ తర్వాత మారుతితో ఒక సినిమా, సాయి రాజేశ్‌తో మరో సినిమా చేయబోతున్నాం. ఆహాలో త్రీ రోజెస్ సీజన్ 2 ఓటీటీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
ఎస్కేఎన్ తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి సమాచారం అందించి, తెలుగు సినిమా పరిశ్రమకు తన సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కల్పించడం ఆయన లక్ష్యంగా ఉందని స్పష్టం చేశారు.


