|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్రిస్మస్ బరిలో ‘బ్యాడ్ గర్ల్స్’.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అంటున్న డైరెక్టర్

Published: 13-12-2025, 2:48 AM
క్రిస్మస్ బరిలో ‘బ్యాడ్ గర్ల్స్’.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అంటున్న డైరెక్టర్
  • ‘బ్యాడ్ గర్ల్స్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
  • రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత కీలక పాత్రలో ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు.
  • డైరెక్టర్ ఫణి ప్రదీప్ దీనిని ‘జాతి రత్నాలు, మ్యాడ్’ తరహా పూర్తి ఎంటర్‌టైనర్ అని తెలిపారు.
  • అనూప్ రూబెన్స్ సంగీతం, ఆస్కార్ చంద్ర బోస్ అందించిన లిరిక్స్ సినిమాకు హైలైట్.

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బ్యాడ్ గర్ల్స్’ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ అని డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి తెలిపారు. రేణు దేశాయ్ రీఎంట్రీ ఈ సినిమాకు మరో హైలైట్ కానుంది.

‘బ్యాడ్ గర్ల్స్’ నటీనటులు, సాంకేతిక వర్గం

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి(Roshini), యష్ణ, రోహన్,పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘బ్యాడ్ గర్ల్స్’(Bad Girls). ఇందులో రేణు దేశాయ్(Renu Desai) కూడా కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనుంది. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తుంది. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్.

డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి ఏమన్నారంటే?

ఈ సందర్భంగా.. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ ‘‘మా ‘బ్యాడ్ గర్ల్స్’ పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి మూవీ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా చిత్రాన్ని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం. అనూప్ రూబెన్స్ గారు మంచి సంగీతం అందించగా ఆస్కార్ చంద్ర బోస్ గారు అని పాటలకు లిరిక్స్ అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయి.

క్రిస్మస్ బరిలో భారీ అంచనాలతో ‘బ్యాడ్ గర్ల్స్’

ఇటీవల విడుదలైన ‘ఇలా చూసుకుంటానే’ పాటకు మంచి ఆదరణ లభించింది, యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ తో దుసుకుపోతుంది. అలాగే ఇటీవల విడుదల అయినా ‘బ్యాడ్ గర్ల్స్’ టైటిల్ సాంగ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. డిసెంబర్ 25న విడుదల అవుతుంది తప్పక చూడండి’’ అని తెలిపారు. కాగా.. క్రిస్మస్ కానుకగా స్టార్ హీరోల చిత్రాలెన్నో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక వాటితో ‘బ్యాడ్ గర్ల్స్’ పోటీ పడబోతుంది.

దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి చెప్పినట్లు, ‘బ్యాడ్ గర్ల్స్’ పూర్తి వినోదభరితంగా ఉండాలని ఆశిస్తున్నారు. క్రిస్మస్ బరిలో ఇతర పెద్ద చిత్రాలతో పోటీపడి, ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.