
‘డిజే టిల్లు’తో యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ, తన తదుపరి చిత్రం ‘బ్యాడాస్’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా విషయంలో తాను చాలా భయంగా ఉన్నానని సిద్ధు వెల్లడించారు. సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Key Points
సిద్ధు జొన్నలగడ్డకు 'డిజే టిల్లు' తర్వాత 'బ్యాడాస్' కీలక చిత్రం.
'బ్యాడాస్' తండ్రీ కొడుకుల భావోద్వేగాలతో కూడిన భారీ యాక్షన్ డ్రామా.
సినిమా విషయంలో తాను చాలా భయంగా, ఆందోళనగా ఉన్నానని సిద్ధు వెల్లడించారు.
దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు.
సిద్ధుకు కలిసొస్తున్న ‘బ్యాడాస్’
డిజే టిల్లుతో యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని.. విభిన్న పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ గత కొద్ది కాలంగా సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda)కు కలిసిరావడం లేదు. ‘డిజే టిల్లు’ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇక ఈ సారి ఎలాగైనా సిద్ధు హిట్ అందుకోవాలన్న కసితో ‘బ్యాడాస్’(Badass) అంటూ ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. రవికాంత్ పేరేపు(Ravikanth Perepu) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదలై.. అంచనాలను పెంచింది.
కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు జొన్నలగడ్డ ‘బ్యాడాస్’ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతుందో వెల్లడించాడు. ‘‘బ్యాడాస్ అనేది తండ్రీ కొడుకుల భావోద్వేగాలో రాబోతున్న పెద్ద యాక్షన్ డ్రామా చిత్రం. ఈ సినిమా కోసం నేను ఎక్జైటింగ్‌గా ఉన్నాను. అలాగే నాకు చాలా భయంగా కూడా ఉంది. చాలా ఆందోళనగా ఉన్నాను. అన్ని బౌండరీస్ చెరిపేసేది ‘బ్యాడాస్’. ఈ సినిమా విషయంలో రవికాంత్‌కు ఎక్జైటింగ్ ఐడియాస్ వస్తున్నాయి. మీరు ఊహించని విధంగా ఉండబోతుంది. మరిన్ని అప్డేట్ల కోసం వేచి ఉండండి’’ అని చెప్పుకొచ్చాడు.
‘బ్యాడాస్’ ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా
సిద్ధు జొన్నలగడ్డ ఆందోళన వెనుక కారణం
మొత్తం మీద, ‘బ్యాడాస్’ కేవలం ఒక యాక్షన్ చిత్రం కాదని, తండ్రీ కొడుకుల బంధాన్ని కూడా చూపిస్తుందని స్పష్టమవుతోంది. సిద్ధుకు ఉన్న భయం, ఆందోళన ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. విడుదల తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.


