|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్.. క్షుద్ర ప్రయోగాలతో నిద్రలేచే ఆత్మ.. ఘోస్ట్ హంటింగ్ ఛానెల్

Published: 07-09-2025, 11:46 PM
ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్.. క్షుద్ర ప్రయోగాలతో నిద్రలేచే ఆత్మ.. ఘోస్ట్ హంటింగ్ ఛానెల్

మరో ఆసక్తికరమైన తెలుగు సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. క్షుద్ర ప్రయోగాలు, ఆత్మలు, ఘోస్ట్ హంటింగ్‌తో కూడిన ‘బకాసుర రెస్టారెంట్’ హారర్ కామెడీ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Key Points

1

ప్రవీణ్ నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ 'బకాసుర రెస్టారెంట్' ఓటీటీలో!

2

క్షుద్ర ప్రయోగాలు, ఘోస్ట్ హంటింగ్, ఆత్మలతో సాగే కథ!

4

హారర్, కామెడీ, థ్రిల్లర్ జోనర్ల అద్భుత మిశ్రమం!

‘బకాసుర రెస్టారెంట్’ ఓటీటీ ప్రయాణం

మరో కొత్త వారం వచ్చేసింది. కొత్త సినిమాలతో, ప్రెష్ రిలీజ్ లతో డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇవాళ (సెప్టెంబర్ 8) ఓటీటీలోకి తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ వచ్చింది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మతో వచ్చే ఇబ్బందులు, భయం తదితర అంశాలతో తెరకెక్కిన ‘బకాసుర రెస్టారెంట్’ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది.

తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ బకాసుర రెస్టారెంట్ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. సోమవారం నుంచే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కమెడియన్ ప్రవీణ్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో అడుగుపెట్టింది. ఇప్పటికే స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. బకాసుర రెస్టారెంట్ ఆగస్టు 8న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోనూ విడుదలైంది ఈ హారర్ కామెడీ థ్రిల్లర్.

హారర్ కామెడీ జోనర్ కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఇప్పుడు అదే జోనర్ లో వచ్చిన బకాసుర రెస్టారెంట్ కూడా ఆడియన్స్ ను అలరిస్తుంది. ఈ సినిమాలో కమెడియన్ ప్రవీణ్ లీడ్ క్యారెక్టర్ చేశాడు. హర్ష చెముడు, గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగర్, షైనింగ్ ఫణి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఎస్ జె శివ డైరెక్టర్. ఎస్ జె మూవీస్ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన ఆచారి ఈ మూవీని నిర్మించారు.

క్షుద్ర పూజలు మరియు ఆత్మ ప్రవేశం

బకాసుర రెస్టారెంట్ కథ ఏమిటంటే?

బకాసుర రెస్టారెంట్ సినిమా ఓ హారర్ కామెడీ ఫిల్మ్. పరమేశ్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటాడు. ఓ మంచి రెస్టారెంట్ పెట్టాలని కల కంటాడు. ఇష్టం లేని జాబ్ చేస్తూ మరో నలుగురు బ్యాచిలర్స్ తో కలిసి ఉంటాడు. వీళ్లందరూ ఈజీగా డబ్బు సంపాదించి రెస్టారెంట్ ఓపెన్ చేయాలని అనుకుంటారు. అందుకు యూట్యూబ్ లో ఘోష్ట్ హంటింగ్ ఛానెల్ క్రియేట్ చేసి వీడియోలు అప్ లోడ్ చేయడం మొదలెడతారు.

ప్రవీణ్ మరియు ఘోస్ట్ హంటింగ్ జట్టు

ఘోస్ట్ హంటింగ్ యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోలు తీసే క్రమంలో ఓ బంగ్లాలోకి వెళ్తుంది ఈ గ్యాంగ్. అక్కడ క్షుద్ర పూజలకు సంబంధించే పుస్తకం దొరుకుతుంది. బకాసుర రెస్టారెంట్ సినిమాలో ఇదే కీలక పాయింట్. అందులోని క్షుద్ర ప్రయోగాలు చేస్తుంటే బక్క సూరి అలియాస్ బకాసురుడు (వైవా హర్ష) ఆత్మ నిద్ర లేస్తుంది. అది పరమేశ్ ఇంటికి వచ్చిన అంజి బాడీలోకి ప్రవేశిస్తుంది.

మరి తర్వాత ఏం జరిగింది? బకాసురుడి కథ ఏంటీ? పరమేశ్ రెస్టారెంట్ కల నెరవేరిందా? అన్నది సినిమాలో చూడాలి. ఈ బకాసుర రెస్టారెంట్ ను ఓటీటీలో ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

బకాసుర రెస్టారెంట్ సినిమా ఓటీటీలో విడుదలై, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. హారర్, కామెడీ, థ్రిల్లర్ల మిశ్రమంతో ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.