|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి బాలకృష్ణ (రేంజ్ రోవర్)

Published: 30-04-2025, 10:46 AM
ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి బాలకృష్ణ (రేంజ్ రోవర్)

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన కొత్త రేంజ్ రోవర్ కారును రిజిస్టర్ చేయడానికి ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన అధికారులతో సరదాగా మాట్లాడి, వారితో సమయం గడిపారు.

Key Points

1

నందమూరి బాలకృష్ణ కొత్త రేంజ్ రోవర్ కారును ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో రిజిస్టర్ చేశారు.

2

కారు నంబర్ TG09F0001.

4

పద్మవిభూషణ్ అవార్డు, సినిమాలు, రాజకీయాల్లో బాలయ్య యొక్క విజయాల గురించి కథనం వివరిస్తుంది.

బాలకృష్ణ కొత్త కారు రిజిస్ట్రేషన్

సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఖైర‌తాబాద్ ఆర్టీవో కార్యాల‌యంలో సంద‌డి చేశారు. బాల‌య్య కొత్త రేంజ్ రోవ‌ర్ కారు కొనుగోలు చేశారు. ఆ కారు నంబ‌ర్ TG09F0001 రిజిస్ట్రేష‌న్ కోసం ఆర్టీవో కార్యాల‌యానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి అధికారుల‌తో బాల‌య్య స‌రదాగా ముచ్చ‌టించారు. అంద‌రూ బాగున్నారా అంటూ అధికారుల‌ను మంద‌లించారు. మోడీ అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌కు తాను వెళుతున్న‌ట్టు తెలిపారు.

ఇక బాల‌య్య‌కు ఇటీవ‌లే కేంద్రం ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సినిమా రంగంలో బాల‌య్య చేసిన కృషికి గానూ ఈ అవార్డు ద‌క్కింది. ప్ర‌స్తుతం ఆయ‌న సీనియ‌ర్ హీరో అయిన‌ప్ప‌టికీ కుర్ర హీరోల‌తో సైతం పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం వ‌రుస‌గా నాలుగు హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్నారు. హీరోగానే కాకుండా అన్ స్టాప‌బుల్ షో ద్వారా ఆయ‌న ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ బాల‌య్య చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆర్టీవో అధికారులతో ముచ్చట్లు

బాలకృష్ణ తాజా విజయాలు

మొత్తంమీద, బాలకృష్ణ యొక్క ఆర్టీవో సందర్శనం చిన్న విషయమే అయినా, ఆయన జీవితంలోని విజయాలను, ప్రజా జీవితంలోని చురుకుదనాన్ని తెలియజేస్తుంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.