
టాలీవుడ్ నటుడు బాలకృష్ణ ఈ రోజు తన 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన సోదరి నారా భువనేశ్వరి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అఖండ 2 సినిమా టీజర్ కూడా విడుదలైంది.
Key Points
బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలు
సోదరి భువనేశ్వరి ఆసక్తికరమైన ట్వీట్
సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న టీజర్
బాలకృష్ణ 65వ పుట్టినరోజు
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (TDP MLA Balakrishna) ఈ రోజు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇందులో భాగంగా.. తన సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి భార్య అయిన నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari.).. బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అమె తన ట్వీట్‌లో.. “నాన్నగారి నట వారసత్వం తో పాటు మంచి మనస్సు, కాస్త చిలిపితనం, ఎంతో క్రమశిక్షణ, దైవ భక్తి కలగలిసిన, మనందరి అభిమాన నటుడు, మా బాల అన్నయ్యకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని రాసుకొచ్చారు. కాగా బాలయ్య ప్రస్తుతం అఖండ 2 (Akhand 2) సినిమాలో నటిస్తుండగా.. పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం.. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం అఖండ 2 టీజర్ (Nara Bhuvaneshwari) సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.
భువనేశ్వరి శుభాకాంక్షలు
అఖండ 2 టీజర్ విడుదల
బాలయ్య పుట్టినరోజు వేడుకలు మరియు అఖండ 2 టీజర్ విడుదలతో సోషల్ మీడియాలో ఆయన అభిమానుల ఆనందోత్సాహాలు చూడముచ్చటగా ఉన్నాయి. భువనేశ్వరి గారి ట్వీట్ బాలయ్య గారికి మరింత ప్రేమను కురిపించింది.


