
ప్రముఖ నటుడు బాలకృష్ణ ‘పద్మ భూషణ్’ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఒక లిక్కర్ కంపెనీ యాడ్‌లో నటించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు కారణమేమిటో చూద్దాం.
Key Points
బాలకృష్ణ 'పద్మ భూషణ్' అవార్డును అందుకున్నారు.
లిక్కర్ కంపెనీ యాడ్‌లో నటించడంపై విమర్శలు.
ఎమ్మెల్యేగా, పద్మ భూషణ్ గ్రహీతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం.
సోషల్ మీడియాలో బాలకృష్ణపై విమర్శల తుఫాన్.
‘పద్మ భూషణ్’ అవార్డు మరియు విమర్శలు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేరు సరసన కొద్దిరోజుల క్రితమే ‘పద్మ భూషణ్’ వచ్చి చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. భారత రత్న, పద్మ విభూషణ్ తర్వాత ఈ అవార్డ్ ప్రాముఖ్యతలో దేశంలోనే మూడవ స్థానం ఉంది. ఏరంగంలోనైనా సరే ఉన్నత స్థాయి విశిష్ట సేవకు గుర్తుగా ఈ అవార్డుతో కేంద్రప్రభుత్వం గుర్తిస్తుంది. దేశంలో మూడో అత్యున్నత అవార్డును అందుకున్న బాలయ్య తాజాగా ఒక లిక్కర్ (మద్యం) కంపెనీకి సంబంధించిన యాడ్‌లో నటించడం సోషల్‌మీడియాలో విమర్శలకు దారితీసింది.
తాను మద్యం తీసుకుంటానని పలు వేదికల మీద బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. తన ఫేవరెట్ బ్రాండ్ ఏంటనేది కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాన్ని ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా.. పలుమార్లు సినిమా వేడుకల సమయంలో తన కుర్చీ పక్కనే మద్యం మిక్స్ చేసిన బాటిల్ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఓటీటీలో బాలకృష్ణ చేసిన ఒక టాక్ షోకు కూడా తనకు ఇష్టమైన బ్రాండ్ కంపెనీనే స్పాన్సర్ చేసింది. అలా బాలయ్యకు ఆ బ్రాండ్‌తో చాలా అనుబంధం ఉంది. అంతవరకు ఫర్వాలేదు, దానిని ఎవరూ తప్పబట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం అదే బ్రాండ్‌కు ఆయన ప్రచార కర్తగా ఒక యాడ్‌ను షూట్ చేసి సంతోషంగా మద్యం తాగేయండి అంటూ వీడియో విడుదల చేశారు.
లిక్కర్ యాడ్‌లో బాలకృష్ణ
ఒక సినీ నటుడిగా బాలకృష్ణ ఇలాంటి యాడ్ చేయడాన్ని ఎవరూ తప్పబట్టరు.. ఎందుకంటే చాలామంది సినీ సెలబ్రిటీలు చేశారు. కానీ, ఇప్పుడు వారందరితో బాలయ్యను పోల్చలేం కదా.. ఎందుకంటే ఆయనొక ఎమ్మెల్యే ఆపై అన్నింటికి మించి దేశంలోనే మూడో అత్యున్నత అవార్డు ‘పద్మ భూషణ్’ను రీసెంట్‌గానే అందుకున్నారు. పేరు పక్కన అంతటి గౌరవం దక్కిన తర్వాత కనీసం కొంత అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆశిస్తారు.
సోషల్ మీడియా ప్రతిస్పందన
కావాల్సినంత డబ్బు, పేరు ఉన్నాయి కదా.. మరీ ఇలాంటి హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ఎందుకంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంలో బాలకృష్ణపై విమర్శలు వస్తున్నాయి. పద్మభూషణ్ అవార్డు అందుకొని నెల కూడా కాలేదు ఇంతలోనే ఒక లిక్కర్ కంపెనీ కోసం యాడ్ చేయడం ఏంటి అంటూ తప్పబడుతున్నారు. బాలయ్య కాస్త అవార్డుకైనా విలువ ఇవ్వవయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా తన బాధ్యతలను గుర్తుంచుకొని, సమాజానికి మంచిదేదో చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విమర్శలు ఆయన భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.


