
సినిమా హీరోలు విగ్గులు, పెట్టుడు మీసాలు ధరించడం సర్వసాధారణం. కానీ, ఇటీవల బాలకృష్ణకు స్టేజ్‌పై సంభవించిన ఒక విషయం వైరల్‌గా ప్రచారం చెందుతోంది. ఆయన పెట్టుడు మీసం ఊడిపోవడంతో…
Key Points
బాలయ్య ప్రసంగాల సమయంలో పెట్టుడు మీసం ఊడిపోయింది.
అందరి ముందే గమ్ అడుగుతూ గరగరలాడాడు.
నెట్టింట ఈ వీడియో వైరల్ అయ్యింది.
బాలయ్య వయసు, విగ్గులు, పెట్టుడు మీసాలపై నెటిజన్ల చర్చ జరుగుతోంది.
స్టేజ్‌పై మీసం ఊడిపోవడం
సినిమా హీరోలు చాలా మంది విగ్గు పెట్టుకోవడం తెలిసిందే. పాత్రలకు తగినట్టు తమ అభిమానులను ఆకట్టుకొనేందుకు చాలా మంది విగ్గులు పెట్టుకొని నటిస్తుంటారు. అయితే రజనీకాంత్ లాంటి కొంతమంది హీరోలు ఇలాంటి విగ్గులు కేవలం సినిమాల వరకే పరిమితం చేస్తుంటారు. నిజ జీవితంలో వయసు తగ్గట్లుగా ప్రవర్తిసూ..సాధారణ వ్యక్తులాగానే జీవితాన్ని కొనసాగిస్తారు. మరికొంతమంది అయితే సినిమాల్లోనే కాదు..బయట కుడా విగ్‌లోనే తిరుగుతారు. వయసు మీద పడినా..అభిమానుల ముందు కుర్రాడిలా కనిపించేందుకు ఫేక్ మీసాలు.. విగ్గులు ధరిస్తుంటారు. అవి లేకుండా బయట కాలు కూడా పెట్టరు. అలాంటి నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. విగ్గు, పెట్టుడు మీసాలు లేకుండా ఆయన బయట తిరగలేరు.
ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయకున్నది పెట్టుడే మీసాలే అన్న విషయం బయటకు వచ్చింది. ఓ స్టేజ్‌పై ఆయన మాట్లాడుతుండగా.. మూతికి అతికించుకున్న ఫేక్ మీసాలు ఊడిపోయాయి. అందరి ముందే గమ్ తెప్పించుకొని మీసాలు అతికించుకొని తన ప్రసంగాన్ని కొనసాగించాడు.
గమ్ కోసం గరం గరం
నందమూరి బాలకృష్ణ ఇటీవల తన 65వ పుట్టిన రోజు(జూన్ 10)ని బసవతారకం ఆస్పత్రిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుకున్నాడు. కత్తిని గాల్లో తిప్పుతూ కేకు కట్ చేసి అభిమానులను అలరించాడు. అనంతరం ఆయన ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడాడు. తన స్పీచ్‌లో ఎప్పటిలాగానే తన బ్లడ్ వేరు..బ్రీడ్ వేరు అని ఊదరగొట్టాడు. అయితే బాలయ్య ఇలా మాట్లాడుతన్న సమయంలో తన పెట్టుడు మీసం కాస్త ఊడిపోయింది. దీంతో కాస్త షాకయిన బాలయ్య.. వెంటనే తేరుకొని గమ్ ఇవ్వండంటూ సిబ్బందిపై గరం గరం అయ్యాడు.
నెటిజన్ల ప్రతిస్పందన
గమ్ ఇవ్వగానే వెనక్కి తిరిగి మీసాలను అతికించుకొని, మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఈ వయసులో విగ్గులు, పెట్టుడు మీసాలు అవసరమా?’, ‘మనదంతా ఓపెన్ బుక్ అని ప్రతిసారి చెప్పే బాలయ్య..ఇలా బయట ఫేక్ మీసాలు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది?’, ‘సినిమాల్లో ఎలాగో తప్పదు.. నిజ జీవితంలో అయినా సహజంగా బతుకొచ్చు కదా?’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
బాలయ్య పెట్టుడు మీసం ఊడిపోవడం, గమ్ కోసం ఆయన చూపిన ప్రతిస్పందన నెటిజన్లను వినోదపరిచింది. వయసు, సహజత్వంపై మళ్ళీ చర్చ జరుగుతోంది.


