
📌 Key Points
- బాలకృష్ణ సినిమాలో విలన్ గా మంచు మనోజ్.. ఇది నిజంగా ఒక సంచలన వార్తే!
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా కోసం మనోజ్ విలన్ అవతారం!
- గతంలో ‘ఉ కొడతారా ఉలిక్కిపడతారా’లో బాలయ్యకు మనోజ్ చేసిన సహాయానికి ఇది బదులు!
- త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి!
టాలీవుడ్ లో ఒక సంచలన కలయికకు రంగం సిద్ధమైంది! మంచు మనోజ్, బాలకృష్ణ కలిసి ఒక భారీ ప్రాజెక్టులో నటించనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రేజీ కాంబో కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
బాలయ్య సినిమాలో మనోజ్ విలన్?
Manchu Manoj: మిరాయ్ సినిమాతో తన లైఫ్ లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు మంచు మనోజ్. ఈ సినిమాలో ఆయన మహాబీర్ లామ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించాడు. తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా. నిజం చెప్పాలంటే, మిరాయ్ సినిమాలో హీరో పాత్ర కంటే విలన్ గా చేసిన మంచి మనోజ్ పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. అంతలా, తన నటనతో అదరగొట్టేశాడు మంచు మనోజ్(Manchu Manoj).
ఇక ఈ సినిమా తరువాత ఆయన వరుసగా విలన్ పత్రాలు చేస్తూ బిజీ అవుతాడని అనుకున్నారు అంతా. అలాగే, అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, మంచు మనోజ్ మాత్రం ఆచితూచి సినిమాలను ఒకే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా డేవిడ్ రెడ్డి అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
గోపీచంద్ మలినేని ప్లాన్ అదిరింది!
ఇదిలా ఉంటే, మంచు మనోజ్ నెక్స్ట్ చేయబోతున్న సినిమా గురించి ఒక కేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, మంచు మనోజ్ మరోసారి తెరపై తన పవర్ ఫుల్ విలనిజాన్ని ప్రదర్శించనున్నాడట. అయితే, ఆ సినిమాలో హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. అవును, బాలయ్య హీరోగా దర్శకుడు గోపించంద్ మలినేని ఓ పవర్ ఫుల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ గతవారమే స్టార్ట్ అయ్యింది.
ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా పే ఆఫ్!
అయితే, ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ ను అనుకున్నాడట దర్శకుడు. ఇదే విషయాన్ని మంచు మనోజ్ దగ్గర ప్రస్తావించగా ఆయన కూడా వెంటనే ఒకే చెప్పేశాడట. కథ, పాత్ర విషయం పక్కనపెడితే కేవలం బాలయ్య మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడట మంచు మనోజ్. అంతేకాదు, గతంలో మంచు మనోజ్ హీరోగా చేసిన ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ అనే సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు బాలకృష్ణ. అందుకే పేఆఫ్ గా ఉంటుందని ఈ సినిమాలో చేసేందుకు ఒప్పుకున్నాడట మంచు మనోజ్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అని టాక్. మరి బాలకృష్ణ, మంచు మనోజ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
మరి బాలకృష్ణ, మంచు మనోజ్ కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


