
📌 Key Points
- బాలకృష్ణ, రమేష్ బాబుల సినిమాల టైటిల్ వివాదం టాలీవుడ్‌లో సంచలనం!
- కృష్ణ తన కుమారుడి చిత్రం ‘సామ్రాట్’ టైటిల్‌ను ముందుగా రిజిస్టర్ చేయించారు.
- బాలకృష్ణ సినిమాకు ‘సామ్రాట్’ టైటిల్ వాడటంతో కృష్ణ అభ్యంతరం తెలిపారు.
- ఎన్టీఆర్ జోక్యంతో బాలకృష్ణ సినిమా టైటిల్ ‘సాహస సామ్రాట్’గా మారింది!
టాలీవుడ్‌లో టైటిల్ వార్‌లు కామన్. కానీ బాలకృష్ణ సినిమా టైటిల్ కోసం ఎన్టీఆర్, కృష్ణనే పోటీ పడితే? అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదా! ఆ సినిమా ఏంటో తెలుసా?
టైటిల్ కోసం బాలకృష్ణ, కృష్ణ మధ్య వివాదం!
Balakrishna : సినీ పరిశ్రమలో ఒకే టైటిల్ కోసం రెండు సినిమాలు పోటీ పడుతుండటం మాములే. ఇటీవల కొన్ని సినిమాలు ఒకే టైటిల్ కోసం పోటీ పడటం, చివరి నిమిషంలో టైటిల్ మార్చడం లేదా టైటిల్ ముందు ఏదో ఒకటి జతచేయడం జరుగుతుంది. ఈ టైటిల్ గొడవలు ఇప్పుడు కాదు కొన్నేళ్ల క్రితం నుంచే ఉన్నాయి. గతంలో బాలకృష్ణ – రమేష్ బాబు సినిమాలు ఒకే టైటిల్ పెట్టుకోవడంతో పెద్ద వివాదమే నడిచింది.
సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబుని 1987లో హీరోగా పరిచయం చేస్తూ సామ్రాట్ అనే టైటిల్ తో సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా టైటిల్ ని కృష్ణ ముందే రిజిస్టర్ చేయించారు.
ఎన్టీఆర్ రంగంలోకి దిగడంతో అసలు ట్విస్ట్!
అయితే అదే సమయంలో బాలకృష్ణ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సామ్రాట్ అనే టైటిల్ తోనే సినిమా మొదలుపెట్టారు. వీళ్ళు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించలేదు. ఈ విషయం కృష్ణకు తెలిసి బాలకృష్ణ సినిమా నిర్మాత శేఖర్ బాబుతో మాట్లాడారు. నేను టైటిల్ రిజిస్టర్ చేయించాను అని కూడా చెప్పినా ఆ నిర్మాత వినలేదు. బాలకృష్ణ సినిమాకు సామ్రాట్ అనే టైటిల్ తోనే ప్రమోషన్స్, యాడ్స్ ఇవ్వడం కూడా చేసారు.
‘సాహస సామ్రాట్’గా మారిన బాలయ్య సినిమా టైటిల్!
దీంతో ఈ టైటిల్ వివాదంగా మారింది. రెండు సినిమాలు కూడా సామ్రాట్ అనే టైటిల్ తోనే ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు. చివరికి సీనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగడంతో ఈ టైటిల్ వివాదం కాస్తా ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ అయింది. ఇద్దరూ ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఈ టైటిల్ కోసం కోర్టుకు కూడా వెళ్లారు. చివరికి సినీ పరిశ్రమలోని కొంతమంది పెద్దలు ఎన్టీఆర్ తో రాయబారం చేయడంతో, కృష్ణ ముందే టైటిల్ రిజిస్టర్ చేయించాడు అని చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. దాంతో బాలకృష్ణ సినిమాకు సాహస సామ్రాట్ అనే టైటిల్ పెట్టుకున్నారు. రమేష్ బాబు సినిమా సామ్రాట్ అనే టైటిల్ తోనే విడుదల అయింది.
టైటిల్ వివాదాలు టాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. బాలకృష్ణ సినిమా టైటిల్ మార్పు వెనుక ఇంత కథ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


