
నందమూరి బాలకృష్ణ తనకు లభించిన పద్మభూషణ్ అవార్డు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటనకు కాకుండా, తన సేవలకు ఈ గౌరవం అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, తాజా చిత్రం అఖండ 2 షూటింగ్ అనుభవాలను కూడా పంచుకున్నారు.
Key Points
బాలయ్య పద్మభూషణ్ అవార్డును తన సేవలకు గుర్తింపుగా భావిస్తున్నారు.
నటనకు కాదు, సేవలకు పురస్కారం అని బాలయ్య అభిప్రాయం.
జార్జియాలోని -4 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్‌లో పాల్గొన్నారు.
పద్మభూషణ్ అవార్డుపై బాలకృష్ణ వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: పద్మభూషణ్ అవార్డుపై నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. బిరుదులకు తాను అలంకారం కానీ తనకు బిరుదులు అలంకారం కాదని అన్నారు. పద్మభూషణ్ అవార్డును తన సేవను చూసి ఇచ్చారనుకుంటానని, నటనకు కాదని అభిప్రాయపడ్డారు. పొరపాటున పద్మభూషణ్ అవార్డును పొరపాటున నటనకు ఇచ్చి ఉంటారని చెప్పారు. తనకు వచ్చిన పద్మభూషణ్ అవార్డులో బసవతారకం ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది కృషి ఉందని అన్నారు.
అఖండ 2 సినిమా షూటింగ్ గురించి చెబుతూ ఇటీవలే జార్జియాలో షూటింగ్ చేశామని తెలిపారు. షూటింగ్ సమయంలో -4 డిగ్రీల ఉష్ణోగ్రతలో సన్నివేశాలు చిత్రీకరించాల్సి వచ్చిందని అన్నారు. అప్పుడు అందరూ వణికిపోతుంటే తాను మాత్రం పైన స్లీవ్ లెస్, కింద పంచ కట్టుకుని అలానే నిలబడిపోయా అని చెప్పారు. ఆ పాత్ర చేయడం శివుడి ఆజ్ఞగా భావిస్తానని చెప్పారు. అది తన పూర్వజన్మ సుకృతం అని భావిస్తానని తెలిపారు. ఎందుకంటే తనకు జన్మనిచ్చిన ఎన్టీఆర్ ప్రతిరూపాన్ని తనలో ప్రేక్షకులు చూసుకుంటున్నారని అన్నారు.
అఖండ 2 చిత్రీకరణ విశేషాలు
బాలయ్య సేవలకు గుర్తింపు
చివరగా, బాలయ్య తన పద్మభూషణ్ అవార్డును తన సేవలకు గుర్తింపుగా భావించి, అఖండ 2 చిత్రీకరణలోని కష్టాలను పంచుకున్నారు. ఆయన అభిప్రాయాలు తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


