
📌 Key Points
- రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జననం: ఒకరు మగ పిల్లాడు, ఒకరు ఆడపిల్ల!
- బాలకృష్ణ నుండి రామ్ చరణ్ కు ప్రత్యేకంగా పూల బొకే, వెంకటేశ్వరస్వామి ఫోటో, ప్రసాదం!
- పిల్లల కోసం స్పెషల్ టాయ్స్ పంపించిన బాలయ్య: టాలీవుడ్ లో హాట్ టాపిక్!
- బాలయ్య, చిరంజీవి మధ్య కోల్డ్ వార్ ఉన్నా.. రామ్ చరణ్ తో మంచి స్నేహం!
మెగాస్టార్ చిరంజీవి ఇంట వారసుడు రాకతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టడంతో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా గిఫ్ట్ పంపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
బాలయ్య నుండి చరణ్ కి స్పెషల్ గిఫ్ట్!
మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకూ ఆడపిల్లలే పుడుతూ వచ్చారు. మా ఇంట్లో అందరు మహాలక్ష్ములే ఉన్నారని మెగాస్టార్ సంబరపడిపోతుంటారు. కానీ ఒక్క వారసుడు కావాలని చిరంజీవి పలు సందర్భాల్లో తన కోరిక వెల్లడించారు. ఇక ఎట్టకేలకు ఆయన ఆశ నెరవేరింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు రీసెంట్ గా కవలపిల్లలు పుట్టగా.. అందులో ఒకరు మగపిల్లాడు, ఒక ఆడపిల్ల పుట్టారు. చరణ్ దంపతులకు రెండేళ్ల క్రితం ఒక ఆడపిల్ల పుట్టగా.. ఆమెకు క్లింకారా అని నామకరణం కూడా చేశారు. ఇక మెగా వారసుడి రాకతో ఇటు ఫ్యామిలీలో, అటు అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
కవల పిల్లలు పుట్టడంతో రామ్ చరణ్ కు వరుసగా శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఇటు అభిమానులు, అటు ఇండస్ట్రీ స్నేహితులు.. అందరు వరుసగా మెగా హీరోను విష్ చేశారు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే సోషల్ మీడియాలో చరణ్ ను విష్ చేశారు. పర్సనల్ గా కూడా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో నందమూరి నట సింహం బాలకృష్ణ కూడా రామ్ చరణ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. స్పెషల్ గిఫ్ట్ పంపించాడట. ఇంతకీ ఆయన ప్రత్యేకంగా ఏం భహుమతి పంపించాడటంటే.?
కవల పిల్లలకు బాలయ్య ఆశీస్సులు!
రామ్ చరణ్ కి కవల పిల్లలు పుట్టిన సందర్భంగా బాలయ్య ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఓ పూల బొకేను పంపించాడట. దానితో పాటు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఫోటో, ప్రసాదం కూడా పంపించాడట. అంతే కాదు పిల్లలకు స్పెషల్ గా టాయ్స్ కూడా పంపించినట్టు టాలీవుడ్ లో టాక్ గట్టిగానడుస్తోంది. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కానీ.. ఈ విషయంపై మెగా, నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. బాలయ్య కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారట రామ్ చరణ్ అభిమానులు.
బాలకృష్ణ, చిరంజీవి మధ్య బాక్సాఫీస్ వార్ జరుతుంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. సినిమాల విషయంలోనే కాదు వ్యక్తిగతంగా కూడా కూడా ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్డ్ నడుస్తుంటుంది. లాస్ట్ ఇయర్ బాలయ్య అసెంబ్లీలో చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ అయ్యాయి. చిరంజీవి ని అవమానించాడని.. మెగా అభిమానులు రెచ్చిపోయారు. ఈ ఇద్దరు ఎక్కడైనా కలిస్తే మాత్రం చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటారు. చిరంజీవి తో బాలయ్య రిలేషన్ ఎలా ఉన్నా… రామ్ చరణ్ తో మాత్రం బాలయ్య కు మంచి స్నేహం ఉంది. వీరు కలిసినప్పుడల్లా కడుపుబ్బా నవ్వుకుంటుంటారు. బాలయ్య పట్ల రామ్ చరణ్ చూపించే గౌరవం.. బాలయ్య రామ్ చరణ్ పట్ల చూపించే ప్రేమ అందరికి తెలుసు?
మెగా, నందమూరి అభిమానుల్లో ఆనందం!
రామ్ చరణ్ కు మొదటి సంతానం కలిగిన టైమ్ లోనే.. ఆర్ఆర్ఆర్ ప్రపంచ స్థాయిలో అవార్డులు సాధించింది. ఆస్కార్ కూడా వచ్చింది. అంతే కాదు చరణ్ కు ఎన్నో గౌరవాలు కూడా దక్కాయి.. ఇక రీసెంట్ గా కవలలు పుట్టిన టైమ్ లోనే మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పిల్లల రాకతో చిరంజీవి ఫ్యామిలీలో అన్నీ శుభాలే జరుగుతున్నాయి. వరుసగా రెండు ఫెయిల్యూర్స్ చూసిన రామ్ చరణ్ కు పెద్ది సినిమాతో హిట్ పడుతుందో లేదో చూడాలి. పెద్ది సినిమాపై రామ్ చరణ్ తో పాటు అభిమాను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
బాలకృష్ణ పంపిన గిఫ్ట్ తో మెగా, నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మళ్ళీ కలుద్దాం!


