|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటుడిగా, పొలిటీషియన్‌గా, హోస్ట్ గా సక్సెస్‌ అయిన బాలకృష్ణ, ఆ ఒక్క విషయంలో మాత్రం ఫెయిల్యూర్‌

Published: 10-06-2025, 3:14 AM
నటుడిగా, పొలిటీషియన్‌గా, హోస్ట్ గా సక్సెస్‌ అయిన బాలకృష్ణ, ఆ ఒక్క విషయంలో మాత్రం ఫెయిల్యూర్‌

నటుడు, రాజకీయ నాయకుడు, టాక్ షో హోస్ట్ గా సక్సెస్‌ అయిన బాలకృష్ణ, నిర్మాణ రంగంలో మాత్రం విజయం సాధించలేకపోయారు. ఆయన నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Key Points

1

బాలకృష్ణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, టాక్ షో హోస్ట్ గా విజయం సాధించారు.

2

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నారు.

4

అన్‌స్టాపబుల్ టాక్ షో భారతదేశంలో అత్యంత విజయవంతమైన టాక్ షోగా నిలిచింది.

నటుడిగా అద్భుత విజయం

ఎన్టీ రామారావు నటవారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఆయన బాటలోనే పయణిస్తున్నారు బాలయ్య. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. మాస్‌ హీరోగా రాణిస్తున్న బాలయ్య ఇటీవల కాలంలో వరుసగా విజయాలు అందుకుని అత్యంత సక్సెస్‌ ఫుల్‌గా హీరోగా నిలిచారు. సక్సెస్‌ పరంగా ఇప్పుడు సీనియర్లలో బాలయ్యనే టాప్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

బాలకృష్ణకి `అఖండ` నుంచి వరుసగా విజయాలు వరిస్తున్నాయి. `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి`, `డాకు మహారాజ్‌` చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ఈ నాలుగూ వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాయి. సీనియర్లలో ఇది అరుదైన ఘనత అని చెప్పొచ్చు. ఇప్పుడు `అఖండ 2`తో రాబోతున్నారు. డబుల్‌ హ్యాట్రిక్‌ కి రెడీ అవుతున్నారు.

హీరోగా మోస్ట్ సక్సెస్‌ ఫుల్‌గా రాణిస్తున్న బాలయ్య.. పొలిటీషియన్‌గానూ సక్సెస్‌ అయ్యారు. తన తండ్రి రామారావు నియోజకవర్గం అయిన హిందూపురం నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తన నియోజకవర్గంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా రాజకీయంగానూ విజయం సాధిస్తున్నారు ఎన్బీకే.

రాజకీయ రంగంలో విజయం

మరోవైపు హోస్ట్ గానూ విజయవంతంగా రాణించారు. బాలయ్య హోస్ట్ గా మారి `అన్‌ స్టాపబుల్‌` టాక్ షో చేసిన విషయం తెలిసిందే. `ఆహా`లో ప్రసారం అయిన ఈ షో ఇండియాలోనే అత్యంత విజయవంతమైన టాక్‌ షోగా నిలిచింది. టాప్‌ రేటింగ్‌ని కూడా సొంతం చేసుకుంది. ఇలా బాలయ్య ఏ రంగంలోనూ అడుగుపెట్టినా, అందులో సక్సెస్‌ అయ్యారు. కానీ ఒక్క విషయంలో ఆయన సక్సెస్‌ కాలేకపోయారు.

బాలకృష్ణ నిర్మాతగా సక్సెస్‌ కాలేకపోయారు. ఆయన తన తండ్రి బయోపిక్‌ `ఎన్టీఆర్` చిత్రాన్ని తన సొంత బ్యానర్‌పై నిర్మించారు. ఎన్బీకే ఫిల్మ్స్ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ని స్టార్ట్ చేసి, `ఎన్టీఆర్‌` బయోపిక్‌ని నిర్మించారు. సుమారు 50-60కోట్లు ఖర్చు చేసి ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా నిర్మించారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్యనే.. తన తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. నటుడిగా సక్సెస్‌ అయ్యారు, కానీ నిర్మాతగా సక్సెస్‌ కాలేదు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

ఇదే కాదు అంతకు ముందు కూడా సహనిర్మాతగా వ్యవహరించారు. `సుల్తాన్‌` చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిజాస్టర్‌. పలు సినిమాలకు పరోక్షంగా సహకరించారు. అవి కూడా ఆడలేదు. బాలయ్య నిర్మాతగా మారి చేసిన ప్రయత్నం విఫలమయ్యింది.

నిర్మాతగా విఫలం

ఇక తన కూతురు తేజస్విని ని ప్రొడక్షన్‌లోకి దించారు. తన కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఓ మూవీని ప్రకటించారు. కానీ ఈ చిత్రం ఆదిలోనే ఆగిపోయింది. దీంతో బాలయ్య నిర్మాతగా మారిన ప్రయత్నాలు వరుసగా బెడిసికొడుతున్నాయి.

అయినా వెనకడుగు వేసే ఛాన్స్ లేదు. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని తానే నిర్మించే అవకాశం ఉంది. అలాగే `ఆదిత్య 999` మూవీని రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూవీని కూడా ఆయనే నిర్మించే అవకాశాలున్నాయి. మరి వీటితోనైనా సక్సెస్‌ అవుతారేమో చూడాలి.

బాలకృష్ణ తన వివిధ రంగాలలోని విజయాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, నిర్మాతగా ఆయన ప్రయాణం విజయవంతం కాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ వంటి ప్రయత్నాలు ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.