
📌 Key Points
- అఖండ 2 నాలుగో రోజు 5.35 కోట్లు వసూలు చేసింది.
- సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియన్ నెట్ కలెక్షన్ 66.45 కోట్లు.
- ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 ఇప్పటివరకు 83 కోట్లు వసూలు చేసింది.
- సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 విడుదలై 4 రోజులు పూర్తయింది. తొలిరోజు భారీ వసూళ్లు సాధించినప్పటికీ, ఆ తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా నాలుగో రోజు వసూళ్లు నిరాశపరిచాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.
మొదటి 4 రోజుల్లో అఖండ 2 వసూళ్లు
నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా అఖండ 2 రిలీజై 4 రోజులు పూర్తయింది. ఎన్నో అవాంతరాలు దాటుకుని డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది అఖండ 2. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాకపోయినా, మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర భారీగానే వసూలు చేసింది బాలయ్య సినిమా.
అఖండ 2 సినిమా రిలీజై 4 రోజులైంది. మొదటిరోజు బాగానే వసులు చేసిన ఈసినిమా.. రెండో రోజు నుంచి తగ్గుతూ వచ్చింది. sacnilk.com ప్రకారం, ఈ సినిమా నాలుగో రోజు 5.35 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 66.45 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది.
బాలయ్య సినిమాకు ఎదురుదెబ్బ – కలెక్షన్ల పతనం
అఖండ 2 సినిమా ఓపెనింగ్ రోజున 22.5 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు 15.5 కోట్లు, మూడో రోజు 15.1 కోట్లు వసూళ్లను సాధించింది. మొదటి సోమవారం ఈ సినిమా కలెక్షన్ భారీగా పడిపోయాయి.
అఖండ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 83 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఈసినిమా ఓవర్సీస్ కలెక్షన్ 10.60 కోట్లు, ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 72.40 కోట్లు.
అఖండ 2 ప్రపంచవ్యాప్త వసూళ్లు, బడ్జెట్ వివరాలు
నందమూరి బాలకృష్ణ అఖండ 2లో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, శాశ్వత ఛటర్జీ, సాంగే షెల్ట్రిమ్, రాన్సన్ విన్సెంట్, విజి చంద్రశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలయ్య అఘోరాగా అదరగొట్టాడు. సిల్వర్ స్క్రీన్ మీద నటసింహం పెర్ఫామెన్స్ చూసిన అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. ఇక ఈసినిమాకు దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం.
నందమూరి బాలకృష్ణ అఖండ 2, 2021లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 70 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా 150 కోట్ల బిజినెస్ చేసింది.మరి అంతకు మించి అంచనాలతో రిలీజ్ అయిన ఈసినిమా.. ఫైనల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణకు ఈ సినిమా విజయం ఎంతో ముఖ్యం. అఖండ2 హిట్ అయితే… ఆయన ఖాతాలో 5వ హిట్ పడుతుంది.. మరోసినిమాకూడా సక్సెస్ సాధిస్తే.. బలయ్య ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్ పడుతుంది.
అఖండ 2 భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, వసూళ్ల పతనం ఆందోళన కలిగిస్తోంది. 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఈ సినిమా, మరిన్ని వసూళ్లు రాబట్టడం బాలయ్య అభిమానులకు కీలకం.


