|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్యకు షాక్: అఖండ 2కి భారీ నష్టాలు! అసలు ఎన్ని కోట్లంటే?

Published: 29-12-2025, 8:22 AM
బాలయ్యకు షాక్: అఖండ 2కి భారీ నష్టాలు! అసలు ఎన్ని కోట్లంటే?
  • బాలయ్య-బోయపాటి కాంబోలో అఖండ 2 నాలుగో చిత్రం, భారీ అంచనాలు. కానీ నిరాశపరిచింది.
  • రిలీజ్ అయిన 17 రోజుల్లోనే అఖండ 2 దాదాపు 40% నష్టాలను చవిచూసింది.
  • తొలి షో నుంచే మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టించలేకపోయింది.
  • రిలీజ్ డేట్ మార్పు, ఆర్థిక వివాదాలు సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపాయి.

బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ నష్టాలను మూటగట్టుకుంది. దీనికి గల కారణాలు, కలెక్షన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అఖండ 2పై అంచనాలు.. వాస్తవ పరిస్థితులు

Akhanda 2 Collections : అఖండ 2 మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే అది బాలయ్య మూవీ. ఇంకా చెప్పాలంటే… కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్లాక్ బస్టర్ కొట్టిన అఖండ మూవీకి ఇది సీక్వెల్. ఇంకా చెప్పాలంటే.. సూపర్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన బాలయ్య – బోయపాటి కలిసి చేస్తున్న నాలుగో సినిమా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ మూవీ చాలా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ అఖండ 2 మూవీ భారీగా నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

చాలా నాటకీయ పరిణామాల మధ్య అఖండ 2 రిలీజ్ అయింది. రిలీజ్ అయి.. ఆదివారం నాటికి 17 రోజులు అయింది. మొదటి షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న అఖండ 2 మూవీ.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోయింది. బాలయ్య ప్రభావం కానీ, సినిమాలో పెట్టిన ఆధ్యాత్మిక అంశాలు కానీ, ఆడియన్స్‌ను థియేటర్స్ బాట పట్టించలేకపోయాయి. అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్‌పై విపరీతంగా ట్రోల్స్ కూడా వచ్చాయి.

బాక్సాఫీస్ వద్ద అఖండ 2 పరిస్థితి ఏంటి?

నిన్నటి వరకు అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ చూస్తే.. అఖండ 2 మూవీకి దాదాపు 40 శాతం మేర నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. బాలయ్య మూవీకి.. అందులోనూ సక్సెస్‌ఫుల్ మూవీకి వచ్చిన సీక్వెల్‌కు ఇలాంటి నష్టాలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

భారీ నష్టాలకు అసలు కారణాలివే!

40 శాతం నష్టాలు రావడానికి ప్రధాన కారణం.. రిలీజ్ డేట్ మార్పే అని తెలుస్తుంది. అఖండ 2 మూవీని ముందుగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. 4వ తేదీన ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. కానీ, నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ వాళ్లు తమకు 28 కోట్లు ఇవ్వాలి అంటూ కోర్టులో కేసు వేశారు ఎరోస్ ఇంటర్నేషనల్ వాళ్లు. అలాగే ఇక్కడ లోకల్ ఫైనాన్షియర్స్ ఆర్థిక లావాదేవీలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అవి అన్నీ క్లియర్ చేసుకుని డిసెంబర్ 12న రిలీజ్ చేశారు. దీని ప్రభావం సినిమాపై, సినిమా కలెక్షన్లపై తీవ్రంగా పడిందని తెలుస్తుంది.

అఖండ విజయం తర్వాత అఖండ 2పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, మిక్స్‌డ్ టాక్, రిలీజ్ డేట్ వివాదాలతో అనుహ్యంగా నష్టాలను చవిచూసింది. ఈ ఫలితం బాలయ్య, బోయపాటి అభిమానులను నిరాశపరుస్తూ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.