
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘బల్టీ’ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. షేన్ నిగమ్, సెల్వరాఘవన్ కీలక పాత్రల్లో నటించిన ఈ రస్టిక్ విలేజ్ డ్రామా ఈ నెల 10న థియేటర్లలో విడుదలవుతోంది. చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
Key Points
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో 'బల్టీ' సినిమా రూపొందింది.
తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోకి వస్తోంది.
ఎల్మా పిక్చర్స్ ద్వారా 'బల్టీ' తెలుగులో అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది వెలంపాళయం నేపథ్యంలో ముగ్గురు పెద్దలు, కబడ్డీ ప్లేయర్స్ మధ్య జరిగే గ్రామీణ డ్రామా.
బల్టీ: నటీనటులు, సాంకేతిక బృందం
BALTI : షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బల్టీ. శివలింగం దర్శకత్వంలో తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ.. తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన బల్టీ (BALTI ) చిత్రాన్ని తెలుగు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారని చెప్పారు. షేన్ నిగమ్ అద్భుతంగా నటించారని, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్ నటన ఆకట్టుకుంటుందన్నారు. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ పాత్రలో జీవించారన్నారు.
తెలుగులో బల్టీ విడుదల తేదీ, ఇతర వివరాలు
Samantha : హమ్మయ్య ఎట్టకేలకు సమంత మొదలుపెడుతుంది.. చాన్నాళ్ల తర్వాత..
బల్టీ కథా నేపథ్యం, ఆసక్తికర అంశాలు
దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ .. తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జరిగే ఔట్ అండ్ ఔట్ రా రస్టిక్ విలేజ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దలు వారి మధ్య జరిగే వ్యాపార రాజకీయాల్లో నలుగురు కబడ్డీ ప్లేయర్స్ చిక్కుకోవడం, ఆపై వచ్చే ఘర్షణలు, భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం ఉంటుందన్నారు.
మలయాళంలో మంచి విజయం సాధించిన బల్టీ, తెలుగులోనూ అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఉన్ని శివలింగం దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.


