
📌 Key Points
- బాలు మాస్టర్ ప్లాన్: నర్సుతో 2 వేల డీల్ చేసి మనోజ్‌కు షాక్!
- శ్రుతి, రవిలతో శోభన గొడవ: ఇంటిలో తీవ్ర ఉద్రిక్తత, సంచలన పరిణామాలు.
- బాలు మాటతో మనోజ్‌కు కష్టాలు: గేటుకు గుద్దుకుని కిందపడిన మనోజ్.
- ప్రభావతి నుండి బాలుకు ప్రశంసలు: ఊహించని మలుపు, అభిమానులలో ఆసక్తి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నేటి ఎపిసోడ్ అభిమానులను ఉర్రూతలూగించింది! బాలు మాస్టర్ ప్లాన్, శోభన గొడవలు, ప్రభావతి ప్రశంసలు.. ఇలా ఒక్కటేమిటి, ఎన్నో సంచలనాలతో నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు తెలుసుకుని థ్రిల్ అవ్వండి!
నర్సుతో బాలు 2 వేల డీల్: మాస్టర్ ప్లాన్ సక్సెస్!
Gunde Ninda Gudi Gantalu Serial July 10th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 10వ ఎపిసోడ్‌లో మనోజ్ ఓవరాక్షన్ చేస్తాడు. బాలు, మీనాలవి దొంగ లెక్కలు అంటాడు. దాంతో నర్సుతో 2 వేల డీల్ కుదుర్చుకుని మనోజ్‌కు బుద్ధి చెప్పేందుకు బాలు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. శ్రుతి, రవితో శోభన గొడవ పడుతుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ డబ్బు గురించి అన్న మాటలకు బాలు కోపంగా బయటకు వస్తాడు. మనం ఎంత చేసినా వాళ్లు అలాగే మాట్లాడతారు. మనం కోప్పడి వాళ్లలాగే చేస్తే ఎలా, టైమ్ చూసి ఆడుకుందురు అని మీనా కంట్రోల్ చేస్తుంది.
అలాంటిదేం ఉండదని నర్స్ అంటుంది. వాడు ఎంత కంగారు మనిషో చూశారుగా. అన్నింటికి భయపడతాడు. రెండు రోజుల తర్వాత విప్పితే బాగుంటుందని బాలు అంటాడు. కానీ, డాక్టర్ నన్ను తిడతారని నర్స్ చెబుతుంది. నర్సుకు డబ్బులు ఇచ్చి ఈసారికి నా మాట వినండి. రెండు రోజుల తర్వాత ఇంటికొచ్చి మీరే కట్లు విప్పండి. అప్పుడు కూడా మీకు ఫీజ్ ఇస్తానని బాలు అంటాడు.
మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని నర్స్ అడుగుతుంది. మీకు సమాధానం కావాలా.. 2 వేలు కావాలా అని బాలు అంటాడు. 2 వేలే అని నర్స్ లోపలికి వెళ్తుంది. అంతా బాగానే ఉంది. కానీ, కట్లు విప్పితే మళ్లీ సమస్య రావచ్చు. మళ్లీ రిపోర్ట్స్ చూస్తున్నారు అని నర్స్ అంటుంది. లేదు నేను ఇంటికి వెళ్తాను అని మనోజ్ కంగారుపడతాడు.
బాలు, రవి పట్టుకుని తీసుకొస్తే మనోజ్ ఓవర్ చేస్తాడు. నన్ను పట్టుకుని నడిపించకండి. నాకు తెలియని ఇల్లా అని నడిచి వెళ్లి గేటుకు గుద్దుకుంటాడు. తర్వాత గేటు గుమ్మం తగిలి కిందపడతాడు. నాన్నను అంటే కళ్లు పోతాయి నన్ను అంటే పళ్లు రాలతాయన్నాగా. ఇలాగే చేస్తే నీ కాళ్లు.. అని బాలు అనబోతుంటే మీనా నోరు మూస్తుంది.
నాలుకు మీద మచ్చ ఉన్నట్టుంది. ఏదంటే అది అవుతుందన్న మీనా వెళ్లి హారతి తీసుకొస్తుంది. ప్రభావతి హారతి తీసుకుంటుంది. మీనాను తిడుతుంది. మీనాను ఏమైనా అంటే.. వీడి చేతులు కాలుతాయని బాలు అంటాడు. అన్నట్లుగానే హారతి తగిలి మనోజ్ చేతులు కాలుతాయి. మీనా నవ్వుతుంది. బాలు అన్నాడు జరిగిందని శ్రుతి అంటుంది.
శ్రుతి, రవిలతో శోభన గొడవ: ఉత్కంఠ రేపుతున్న డ్రామా!
ప్రభావతి బాలును అంటే.. నిన్ను కూడా శపిస్తానంటాడు. రోహిణిని అంటే నీళ్లు పట్టుకుని శపిస్తానని బాలు అనబోతుంటే నోరు మూసి గదిలోకి బాలును లాక్కెల్తుంది మీనా. కళ్లు పోయాయిగా వదిలేయండని పాపం అని మీనా అంటే.. ఈ రెండు రోజుల్లో వాడికి బుద్ధి వచ్చేలా చేయాలని, వాడికి కళ్లు వచ్చాయి కాబట్టి ఏం కాదని బాలు అంటాడు.
తర్వాత మనోజ్‌ను డైనింగ్ టేబుల్‌పై రోహిణి కూర్చొబెడుతుంది. ఆకలేస్తుంది. ఆ మీనా ఎక్కడ చచ్చిందని మనోజ్ అంటాడు. ఆ మాటలు బాలు, మీనా వింటారు. టిఫిన్ ఇక్కడే ఉందని చెబుతుంది రోహిణి. మరోసారి హాస్పిటల్ బిల్ బాగా చూడు. దొంగ లెక్కలు చూపిస్తారు. వాళ్లు కావాలనే డబ్బులు వసూలు చేసేందుకు దొంగ లెక్కలు చూపించి ఉంటారని మనోజ్ అంటాడు.
ఏమైందని బాలు, మీనా వచ్చి అడుగుతారు. వీడే ప్లేట్ మార్చి ఉంటాడని మనోజ్ అంటే.. వాళ్లు ఇప్పుడే వచ్చారని రోహిణి చెబుతుంది. మమ్మల్ని ఇలా అన్నందుకే ఈ గతి పట్టిందని బాలు అంటాడు. మమ్మల్ని ఏదోటి అంటూనే ఉంటాడు నువ్వైనా చెప్పు రోహిణి అని మీనా అంటుంది. కారంతో అంటున్నాడని రోహిణి అంటుంది. మళ్లీ మనోజ్ ఏదోటి అనబోతుంటే ఇడ్లీ కుక్కి నోరు మూసుకుని తినమంటుంది రోహిణి .
పక్కకు వెళ్లిన బాలు వీడికి ఇలాగే డోస్ మీద డోస్ పెంచాలని మీనాతో అంటాడు. మరోవైపు కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకుంటుంది శ్రుతి. నాకు మీలాంటి ఎంప్లాయ్ కావాలి. మీరు చాలా అందంగా, స్మార్ట్‌గా ఉన్నారు. బాగా చదువుకుని ఇలాంటి జాబ్ ఎందుకు. మా కంపెనీలో మీకు మంచి జాబ్ రికమండ్ చేస్తాను అని కస్టమర్ అంటాడు.
మరో టేబుల్ దగ్గర తల్లి శోభన ఉంటుంది. నీ స్థాయి ఏంటీ చేసే పని ఏంటని శ్రుతిపై కోప్పడుతుంది శోభన. నీతో చాకిరి చేయిస్తూ నీ అత్త మామలు ఇంట్లో కూర్చుని తింటున్నారు. సిగ్గు లేదా వాళ్లకు అని శోభన అంటే.. మాటలు మర్యాదగా రాని మమ్మీ. ఒకరు చెబితే నేను ఇక్కడ పనిచేయట్లేదు అని తల్లిపై రివర్స్ అవుతుంది శ్రుతి.
శ్రుతి జాబ్ విషయంలో నా ప్రమేయం, నా తల్లిదండ్రుల ప్రమేయం లేదని రవి చెబుతాడు. అంతా చూస్తున్నారు. డిగ్నిటీగా బిహేవ్ చేయు. ఇక్కడి నుంచి వెళ్లు అని శ్రుతి అంటుంది. ఇది ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటా అని కోపంగా వెళ్తుంది శోభన . శ్రుతితో ఈ తలనొప్పి ఏంటీ. నిన్ను హింసిస్తున్నట్లు అందరికి చాటింపు వేయిస్తే ఎలా అని రవి అంటాడు.
ప్రభావతి నుండి బాలుకు ఊహించని ప్రశంసలు!
వాళ్ల నోరు నేను మూయిస్తానుగా అని శ్రుతి అంటుంది. ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యావని కోప్పడుతాడు రవి. వాళ్ల మాటలకు ఇరిటేట్ కాకని కన్విన్స్ చేస్తుంది శ్రుతి. మరోవైపు మురళిని విద్య కలుస్తుంది. విద్యకు ఇష్టమైనవి రాసిన లెటర్ మురళి చదివినట్లు చెబుతాడు. మనిద్దరి ఆలోచనలు చాలా వరకు ఒకేలా ఉన్నాయని అంటాడు.
మురళి వెళ్లి దేవుడుకి మొక్కుకుంటాడు. మరోవైపు ప్రభావతితో మనోజ్ బాలు గాడు హాస్పిటల్ బిల్ కట్టినట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అదంతా విని నాన్న వాడి పేరు మీద ఆస్తి రాసిస్తాడేమో అని అంటాడు. అది బాలు వింటాడు. మీ నాన్న నీలా కాదు. వాడి మీద ఏడవకుండా సైలెంట్‌గా కూర్చో. చచ్చి చెడీ వాళ్లు హాస్పిటల్ బిల్ కట్టారు. నువ్వు పార్కులో, రోహిణి హాస్పిటల్ ముందు అడుక్కునేవారు. వాడు వింటే నోరు పడిపోవాలంటాడు అని ప్రభావతి వెళ్లిపోతుంది.
నువ్వు కూడా బాలు గాడిని మెచ్చకుంటే వాడి కాళ్లు నేలమీద ఉంటాయ. రూపాయికి రెండు రూపాయలు తీసుకుంటాడు. వాడు ఆస్తి రాయించుకుంటాడు. వాడిని, మీనాను ఇంట్లో లేకుండా చేయాలి. నువ్వు రోహిణి కలిసి ప్లాన్ చేయండమ్మా అని మనోజ్ అంటాడు. ఆ మాటలు విన్న బాలు చైర్ ఎత్తబోయి ఆగుతాడు. మనోజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంటాడు.
మీనాను అంటే అనకుండా ఉంటానా. నువ్వు కూడా కిందపడిపోతావని బాలు అంటాడు. అలాగే ప్రభావతి అనుకోకుండా కిందపడిపోతుంది. నీ నోరు పాడుగాను నా నడుము విరిగింది. రేయ్ మనోజ్‌గా నేను కూర్చునే కుర్చీ లాగేసావ్ అని తిడుతుంది ప్రభావతి. చేయి ఇవ్వమంటే నీలాంటి వాళ్లను క్షమించడం కూడా పాపమే అని బాలు అంటాడు.
మనోజ్ చేయి ఇస్తానంటాడు. మళ్లీ బాలు అనడంతో తల్లిని లేపబోయి మనోజ్ కూడా పడిపోతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో రాబోయే ఎపిసోడ్‌లు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. బాలు, శోభన, ప్రభావతి పాత్రలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. మరిన్ని సంచలన అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి!


